గోపీచంద్ మలినేని..బాలయ్య కాంబినేషన్ లో తయారవుతున్న 'జై బాలయ్య' సినిమా నుంచి ఓ స్టిల్ వదిలారు. నాచురల్ గా 'సామాజిక మీడియా', ఫ్యాన్స్ అదిరిపోయిందిగా..అంటూ ఎఫ్ 3 లో వెంకీ స్టయిల్ లో అంటున్నారు.
కానీ మిగిలిన నెటిజన్లు మాత్రం కొత్తగా ఏముందీ లుక్ లో చెప్పండయ్యా అంటూ అంటున్నారు బన్నీ స్టయిల్ లో. నిజంగానే బాలయ్య ను చూస్తుంటే బోయపాటి సినిమాల్లో ఎలా కనిపించాడో అలాగే వున్నాడు.
బాలయ్య మారిపోతాడా? అని ఎవరైనా అడిగేయచ్చు. కానీ కాస్త లుక్ ను సినిమా సినిమాకు హీరోలు ఛేంజ్ చేస్తారు కదా? ఆ మార్పు ఎక్కడా కనిపించలేదు. బోయపాటి సినిమాల్లో వుండిపోయిన స్టిల్ ను తీసి వదిలినట్లుంది అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
గోపీచంద్ మలినేని ఏదైనా బోయపాటికి మించి చేస్తాడు అని అనుకుంటే మళ్లీ అదే స్టయిల్ కనిపించేసరికి ఫ్యాన్స్ లోలోపల డీలా పడ్డారు. యాంటీ ఫ్యాన్స్ పైకే కామెంట్లు విసురుతున్నారు.