బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ది ఏ మతం, ఏ కులం, ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు..? ఆయన్ను అభిమానించేవారే కాదు, సగటు భారతీయుడెవరూ ఇలాంటి ప్రశ్నల జోలికి వెళ్లడు. నటనలో రాణించడానికి కులం, మతంతో సంబంధం ఉంటుందా..? అయినా దిలీప్ కుమార్ కి మతాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఆయన మరణంలో కూడా మతాన్ని లాగి నీఛంగా ప్రవర్తిస్తున్నారు. హిందూ పేరు పెట్టుకోవడం వల్లే దిలీప్ కుమార్ హిందీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారని, డబ్బులు సంపాదించుకున్నారని నోరు పారేసుకున్నారు.
“మొహ్మద్ యూసఫ్ ఖాన్ (దిలీప్ కుమార్) హిందూ పేరు పెట్టుకుని చిత్ర పరిశ్రమలో డబ్బులు సంపాదించారు. ఆయన మరణం నిజంగా భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు హర్యాణా బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగాధిపతి అరుణ్ యాదవ్. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బీజేపీ పరువు తీసింది.
ఇలాంటి మతోన్మాదులు ఉండటం వల్లే దేశంలో ఇంకా మతాల మధ్య విద్వేషాలు రగుతులున్నాయంటూ నెటిజన్లు అరుణ్ యాదవ్ ట్వీట్ పై మండిపడుతున్నారు. నిన్ను చూస్తే సిగ్గేస్తోంది అంటూ.. ప్రముఖ నటి ఊర్మిళ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు. వేలాది నెగెటివ్ ట్వీట్లు ఇప్పుడు బీజేపీపై విమర్శలను మోసుకొస్తున్నాయి.
అరుణ్ యాదవ్ చేసిన పనికి మొత్తం బీజేపీ టార్గెట్ అయింది. అయితే ఆ ట్వీట్ ఇంత వైరల్ అవుతున్నా.. కనీసం బీజేపీ తరపున ఎవరూ క్షమాపణ చెప్పలేదు, ఆ ట్వీట్ డిలీట్ చేయలేదు. రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడం, మతాలను రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటే. అయితే సినిమా నటులకి కూడా మతాలను ఆపాదించడం.
అందులోనూ దిలీప్ కుమార్ మరణం తర్వాత ఇలా ఆయన మతం ఇదీ, ఆయన హిందూ పేరు పెట్టుకుని డబ్బులు సంపాదించారంటూ నీఛమైన కామెంట్లు చేయడం బీజేపీ నేతలకే చెల్లింది. ఒక్క ట్వీట్ తో దేశవ్యాప్తంగా బీజేపీని మరోసారి బజారుకీడ్చారు అరుణ్ యాదవ్.