‘మా’ ఎన్నికలు ఇప్పట్లో లేవ్?

నటుడు ప్రకాష్ రాజ్ ముందే కూసిన కోయిల మాదిరిగా తెలుగు నటీనటుల సంఘం 'మా' అధ్యక్షపదవికి పోటీ చేస్తానని ప్రకటించేసారు. పనిలో పనిగా ప్యానల్ కూడా ప్రకటించి, చాలా మందిని లాక్ చేసేసారు.  Advertisement…

నటుడు ప్రకాష్ రాజ్ ముందే కూసిన కోయిల మాదిరిగా తెలుగు నటీనటుల సంఘం 'మా' అధ్యక్షపదవికి పోటీ చేస్తానని ప్రకటించేసారు. పనిలో పనిగా ప్యానల్ కూడా ప్రకటించి, చాలా మందిని లాక్ చేసేసారు. 

అక్కడితో ఆగకుండా దర్శకుడు పూరి జగన్నాధ్ ఆఫీసు వేదిక గా సైలంట్ గా తన వ్యూహరచన తాను చేసేస్తున్నారు. నిత్యం అక్కడికి సభ్యులను రప్పించి, బుజ్జిగించి, భోజనం పెట్టి, పంపిస్తున్నారని బోగట్టా. ఇన్ని చేస్తున్నా ప్రస్తుతం వున్న కార్యవర్గం ఊ..ఆ అనడం లేదు. ఎన్నికలు పెట్టే మూడ్ లో వున్నట్లు కనిపించడం లేదు. 

దాంతో సహజంగానే ప్రకాష్ రాజ్ కాస్త అసహనానికి గురవుతున్నారు. కాలాతీతం అయితే వ్యవహారం బెడిసి కొడుతుందేమో, వేడి వుండగానే పని జరిగిపోవాలని చూస్తున్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు..జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీటుతున్నారు. 

అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం మా ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నికలు జరిగే వాతావరణం లేదు. మా బై లాస్ లో ఎన్నికయిన సంఘం రెండేళ్లకల్లా దిగిపోయి ఎన్నికలు జరిపించేయాలనే నిబంధన లేదని తెలుస్తోంది. అధ్యక్షుడు అనుకుంటే ఆరేళ్ల వరకు ఎన్నికలు లేకుండా తానే అధ్యక్షుడిగా వుండే ప్రావిజన్ మా బైలాస్ లో వుంది. 

ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు ఇదే విషయాన్ని లీగల్ అడ్వయిజర్ ద్వారా సమాధానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎప్పుడు అని ప్రకాష్ రాజ్ అడిగిన లేఖకు బదులుగా ఈ సమాధానం పంపారని తెలుస్తోంది.

‘‘టీఎస్‌ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌, 2001 ప్రకారం ఒక కార్యవర్గం ఎన్నికైన తర్వాత గరిష్ఠంగా ఆరేళ్ల కాలం ఉండొచ్చు. మా బైలాస్‌లో ఎక్కడా ఒక కార్యవర్గంఎన్నికైన తర్వాత నిర్దిష్టంగా ఇంతకాలం ఉండాలని లేదు. 28 ఏళ్లుగా ఉన్న సంప్రదాయం ప్రకారం ఒక కార్యవర్గం ఒక ఎన్నిక నుంచి మరొక ఎన్నిక దాకా కొనసాగుతుంది. కాబట్టి.. కొత్త కార్యవర్గం ఎన్నికై అధికారాలు చేపట్టే దాకా ప్రస్తుత కార్యవర్గం పూర్తి అధికారాలతో కొనసాగుతుంది’’ అని లీగల్‌ అడ్వైజర్‌ తన అభిప్రాయాన్ని తెలిపారన్నది వినవస్తున్న వార్తల సారాంశం

చూస్తుంటే ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా? ప్రకాష్ రాజ్ ఆశలు నెరవేరుతాయా? అన్నది అనుమానంగా వుంది.