హీరోయిన్ నయనతార పేరు ఉన్నట్లుండి తెలుగు సినిమా వార్తల్లోకి వచ్చింది. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో ఆమె హీరోయిన్ అంటూ వార్తలు వచ్చేసాయి.
అవి చదివి యూనిట్ జనాలు జోక్ లు పేలుస్తున్నారు. నయన్ ను మహేష్ సరసన తీసుకుంటే అక్క గానో, వదిన గానో అయి వుంటుంది అని జోక్ లు కట్ చేస్తున్నారు.
చిరంజీవి చెల్లిగా లూసిఫర్ రీమేక్ లో నయన్ నటిస్తోంది. ఆమెను తీసుకువచ్చి మహేష్ సరసన హీరొయిన్ ను చేసేసారు. అల వైకుంఠపురములో టీమ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా మహేష్ సినిమాకు పని చేస్తోంది. బన్నీ బదులు మహేష్ వుంటారంతే. పూజా హెగ్డే హీరోయిన్ అన్నది పక్కా.
మిగిలిన క్యారెక్టర్లు ఒకటి రెండు మారతాయి తప్ప పెద్దగా మార్పులు వుండవు. పాపం అనవసరంగా నయన్ ను ఇందులోకి లాగారు. ఇలాంటి జోక్ లు కట్ చేయడం కోసమే అయి వుంటుంది.