‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న విడుదల

‘ఓ బేబీ' సూపర్ హిట్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న యాక్షన్-కామెడీ చిత్రం శాకిని డాకిని. Advertisement రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు…

‘ఓ బేబీ' సూపర్ హిట్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న యాక్షన్-కామెడీ చిత్రం శాకిని డాకిని.

రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కొరియన్ సినిమాకు అఫీషియల్ రీమేక్ ఇది. ఈ సినిమాను సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో డేర్‌డెవిల్ లేడీస్ రెజీనా, నివేద సీరియస్ లుక్ ఇంటెన్స్ గా వుంది. టైటిల్ మధ్య అక్షరాలకు పింక్ కలర్ ఇవ్వడం, పోస్టర్ లో ఆ పింక్ లైట్ రెజీనా, నివేదపై పడటం ఆసక్తికరంగా వుంది.

మిడ్‌నైట్ రన్నర్స్ గ్లోబల్ అప్పీల్ కలిగి కథ. కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది.

ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా, విప్లవ్ నైషధం ఎడిటర్ గా పని చేస్తున్నారు.