ప్రయిమ్ ప్రాపర్టీని అమ్మేసిన మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి కి చాలా ప్రాపర్టీలు వున్నాయి. ఇన్నాళ్ల సుదీర్ఘ సినిమా ప్రయాణంలో కష్టపడి సంపాదించి ఆయన చాలా పెట్టుబడులు పెట్టారు. లక్షల్లో పెట్టిన పెట్టుబడులు ఇవ్వాళ కోట్లకు చేరుకున్నాయి. ఇలాంటి ప్రాపర్టీల్లో ఫిల్మ్…

మెగాస్టార్ చిరంజీవి కి చాలా ప్రాపర్టీలు వున్నాయి. ఇన్నాళ్ల సుదీర్ఘ సినిమా ప్రయాణంలో కష్టపడి సంపాదించి ఆయన చాలా పెట్టుబడులు పెట్టారు. లక్షల్లో పెట్టిన పెట్టుబడులు ఇవ్వాళ కోట్లకు చేరుకున్నాయి. ఇలాంటి ప్రాపర్టీల్లో ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్ మీద కీలక ప్రదేశంలో వున్న మూడు వేల గజాలు కూడా వుంది. అప్పట్లో దీన్ని ఆయన ముఫై లక్షలకు కొనుగోలు చేసారని టాక్ వుంది.

ఇప్పుడు ఆ అత్యంత విలువైన స్థలాన్ని విక్రయించేసారని తెలుస్తోంది. నిజానికి ఇలా అమ్మాల్సిన అవసరం నాట్..నాట్ వన్ పర్సంట్ కూడా మెగాస్టార్ కు లేదు. ఎందుకంటే ఆయన స్థాయి అలాంటిది. కానీ ఎందుకో మరి అమ్మేసారు అని తెలుస్తోంది. 

ఈ స్థలం మీద ఓ పాపులర్ దినపత్రిక యజమాని ఎప్పటి నుంచో మోజు పడుతున్నారని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ మేరకు అడుగుతున్నారని బోగట్టా. ఇక్కడ ఆయన ఆ దినపత్రిక చానెల్ కార్యాలయం నిర్మిస్తారని అంటున్నారు.

కొనుగోలు..అమ్మకానికి సంబంధించి అన్నీ క్లియర్ అయ్యాయని, సుమారు 70 కోట్లకు కాస్త అటు ఇటుగా ఈ డీల్ కుదరిందని తెలుస్తోంది. ఇక్కడ గజం రెండు లక్షలకు పైగానే పలుకుతోంది. ఈ డీల్ రెండున్నర లక్షలకు కాస్త తక్కువగా జరిగిందని బోగట్టా.

ఈ విషయంలో క్లారిఫికేషన్ కోసం మెగాస్టార్ పర్సనల్ పీఆర్ చూసే వారిని సంప్రదించగా, కనుక్కుని చెబుతాము అన్నారు. కానీ ఆ తరువాత మరి సమాధానం రాలేదు.