దర్శకుడు త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీ ప్యాక్. అతడు, జులాయి లాంటి సినిమాలు తీసినా, అందులో ఫ్యామిలీ టచ్ అన్నది పక్కకు జరగదు. అదే విధంగా యాక్షన్ జోడించినా అది మాస్ జానర్ లోకి వెళ్లదు. కానీ ఫర్ ఏ ఛేంజ్ ఈ సారి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ మహేష్ ను బాగా ఎగ్జైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంత మాస్, యాక్షన్ సినిమా ఇటీవల మహేష్ చేయలేదు. అయితే దీన్ని పాన్ ఇండియా సినిమా చేయాలా వద్దా అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. సినిమా విడుదల టైమ్ లో బాలీవుడ్ పరిస్థితులు చూసి డిసైడ్ చేస్తారని తెలుస్తోంది.
సినిమాలో త్రివిక్రమ్ స్టయిల్ ఫ్యామిలీ టచ్ ఈ సారి కాస్త తక్కువే వుంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాకు లీడ్ అయిన తొలిసగంలో ఫన్, లవ్, ఫ్యామిలీ జానర్ లు టచ్ చేసి, సెకండాఫ్ మొత్తం మాస్ మీద నడుస్తుందని తెలుస్తొంది.
మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎంత త్వరగా ఈ సినిమా వస్తుందా అని చూస్తున్నారు. హారిక హాసిన సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.