మరో గుడ్ న్యూస్ కూడా చెప్పిన జగన్

కరోనాతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ జగన్ తన సంకల్పాన్ని వీడలేదు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీకే నిధులు అందించే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు 1400…

కరోనాతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ జగన్ తన సంకల్పాన్ని వీడలేదు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీకే నిధులు అందించే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు 1400 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దీని ద్వారా 91 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరబోతోంది. అయితే ఈ సందర్భంగా మరో శుభవార్తను కూడా అందించారు జగన్.

అనివార్య కారణాల వల్ల ఆగిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.

“కరోనా లేకుంటే ఈపాటికే అక్షరాలా 27 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరిట ఈపాటికి రిజిస్టర్ అయి ఉండేవి. బహుశా… అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ కార్యక్రమాన్ని జులై 8న నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి నాంది పలుకుతాం.”

జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాల్లో ఇళ్ల పట్టాల ప్రాజెక్ట్ అత్యంత కీలకమైనది. ఎన్నికల ప్రచారంలో ఎక్కువ మంది ప్రజల్ని ప్రభావితం చేసిన అంశం కూడా ఇదే. మరోవైపు చంద్రబాబు, అతని అనుకూల మీడియా ఈ అంశంపై చేయని రాద్దాంతం లేదు. జగన్ అబద్ధాలు చెబుతున్నారని, మాయమాటలకు మోసపోవద్దని అన్నారు.

అయితే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పేదలకు ఇళ్ల పట్టాలందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొన్న ఉగాదికే కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపించి, రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదు. ఈసారి జులై 8కి తప్పకుండా అందరికీ ఇళ్లపట్టాలిస్తామంటున్నారు ముఖ్యమంత్రి.

కేవలం పట్టాలివ్వడమే కాకుండా.. నాలుగేళ్లలో ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సంక్షోభంలోనే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన జగన్ కు నాలుగేళ్లలో లబ్దిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం పెద్ద సమస్య కాదు. 

నమస్కారమే మన సంస్కారం