రాజమౌళి మెడకు పారాసైట్.. క్లారిటీ ఇచ్చిన జక్కన్న

తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల విషయంలో ఎంతో గుంభనంగా ఉంటారు రాజమౌళి. ఏ హీరో ఇష్టం, ఏ హీరోయిన్ ఇష్టం.. అనే ప్రశ్న వచ్చినప్పుడు తప్పించుకుంటారే తప్ప సూటిగా సమాధానం ఇవ్వరు. అలాంటి రాజమౌళి ఆస్కార్…

తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల విషయంలో ఎంతో గుంభనంగా ఉంటారు రాజమౌళి. ఏ హీరో ఇష్టం, ఏ హీరోయిన్ ఇష్టం.. అనే ప్రశ్న వచ్చినప్పుడు తప్పించుకుంటారే తప్ప సూటిగా సమాధానం ఇవ్వరు. అలాంటి రాజమౌళి ఆస్కార్ విజేతగా నిలిచిన పారాసైట్ సినిమా విషయంలో మాత్రం మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని బైటపెట్టారు. సినిమా చూస్తుంటే తనకి నిద్రవచ్చిందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

దీంతో నెటిజన్లు దర్శక ధీరుడ్ని కూడా వదలకుండా ట్రోల్ చేశారు. హాలీవుడ్ సీన్స్ కాపీకొట్టే రాజమౌళికి పారాసైట్ లాంటి ఒరిజినల్ మూవీ ఎలా నచ్చుతుందంటూ సెటైర్లు వేశారు. రోజురోజుకు ట్రోలింగ్ ఎక్కువవ్వడంతో రాజమౌళి, మరోసారి పారాసైట్ పై  క్లారిటీ ఇచ్చాడు.

“పారాసైట్ నాకు నచ్చకపోవడమనేది నా వ్యక్తిగత అభిరుచి. ఆస్కార్ జ్యూరీలో కూడా లాబీయింగ్ చాలానే ఉంటుంది. మన సినిమాను జ్యూరీ మెంబర్స్ చూడాలంటే చాలా తతంగం నడవాలి. అయినా సరే ఆస్కార్ ఎంపికలో కొన్ని ప్రమాణాలు పాటిస్తారని అందరూ నమ్ముతుంటారు. ఎంత లాబీయింగ్ చేసినా చెత్త సినిమాకు అవార్డు తెచ్చుకోలేమని అంటుంటారు. దాని గురించి నాకు పూర్తి నాలెడ్జి లేదు, గతంలో కూడా ఆస్కార్ గెలిచిన సినిమాల్లో నాకు నచ్చనివి ఉన్నాయి, నచ్చినవి ఉన్నాయి”

పారాసైట్ సినిమాపై తన స్పందన పూర్తిగా వ్యక్తిగతం అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు రాజమౌళి. ఆ సినిమా చూస్తూ నిద్రపోయానని ఇచ్చిన స్టేట్ మెంట్ ని జస్టిఫై చేసుకునేందుకు ఇంత సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకున్నాడు.

తన మార్కెట్ కి ఇబ్బంది వస్తుందనే కారణంతో మీ ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్నకు లౌక్యంగా సమాధానం చెప్పి తప్పించుకునే రాజమౌళి.. పారాసైట్ విషయంలో తనను ఎవరూ నిలదీయని అనుకొని ఉండొచ్చు. అయితే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రం, సున్నిత భావోద్వేగాలతో ముడిపడి మధ్యతరగతి ప్రజలకు దగ్గరైన చిత్రం కావడంతో రాజమౌళి రివ్యూని కూడా నెటిజన్లు తప్పుపట్టారు. తాజాగా రాజమౌళి ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

ఆయన ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ సెట్ చేస్తాడు