కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీటర్ వేదికగా క్షమపణ చెప్పారు.
చుండూరులో జరిగిన సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడటంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆవ్యాఖ్యలపై తాను వెంకటరెడ్డికి కమాపణలు చెప్తునని అన్నారు. అద్దంకి దయాకర్ పై నిబంధనల ప్రకారం చర్యలు తప్పవన్నారు. హోంగార్డు ప్రస్తావనపై కూడా వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు.
రాజకీయాల్లో ఇలాంటి భాష ఎవరికి మంచిది కాదని.. పరిమితులకు లోబడే మాట్లాడాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కమాపణలు తెలియజేస్తూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. తెలంగాణ సాధనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక భూమిక పోషించాడన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఎంతో కీలకమైనదని.. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అవసరమన్నారు.
రేవంత్ రెడ్డి క్షమపణతో కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంతృప్తి వ్యక్తం చేసి ఉపఎన్నికల కోసం కాంగ్రెస్ పొరాడుతారో లేదో చూడాలి. ఇప్పటికి అయిన రేవంత్ రెడ్డి హుందాగా మాట్లాడితే మంచిది నాయకుడు ఎప్పుడు అందరిని కలుపుకొని పోతేనే విజయం సాధిస్తారు.