టాలీవుడ్ తెరపైకి మరో సీక్వెల్

ఇప్పుడంతా సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది. పుష్ప సినిమాకు పార్ట్-2 వస్తోంది. సలార్, కల్కి సినిమాలు 2 భాగాలుగా వస్తున్నాయి. డిజే టిల్లూకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఇండియన్-2 కూడా వస్తోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి…

ఇప్పుడంతా సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది. పుష్ప సినిమాకు పార్ట్-2 వస్తోంది. సలార్, కల్కి సినిమాలు 2 భాగాలుగా వస్తున్నాయి. డిజే టిల్లూకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఇండియన్-2 కూడా వస్తోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి అనుష్క సినిమా కూడా చేరింది. 

అనుష్క కెరీర్ లో హిట్ సినిమాగా నిలిచింది భాగమతి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. త్వరలోనే భాగమతి-2 సెట్స్ పైకి రానుంది.

వరుసగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు చేస్తున్న అనుష్క, భాగమతి-2 కోసం మరోసారి అదే బ్యానర్ పై వర్క్ చేయబోతోంది. కెరీర్ లో అనుష్కకు ఇది 50వ చిత్రం. తాజాగా ఇదే బ్యానర్ పై మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది అనుష్క.

ఈమధ్య సినిమాలు బాగా తగ్గించేసింది అనుష్క. ఒక దశలో ఆమె ఇండస్ట్రీ నుంచి తప్పుకుందంటూ పుకార్లు కూడా వచ్చాయి. అయితే అనుష్క మాత్రం తన కెరీర్ ను కొనసాగించడానికే నిర్ణయించుకుంది. కాకపోతే పరిమితంగా సినిమాలు చేస్తానని ప్రకటించింది. 

ఇందులో భాగంగా తెలుగులో ఇప్పటికే ఓ సినిమాను విడుదల చేసిన ఈ హీరోయిన్, ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. అది పూర్తయిన వెంటనే భాగమతి-2 సెట్స్ పైకి వస్తుంది. అన్నట్టు చిరంజీవి హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న విశ్వంభర సినిమాలో కూడా అనుష్కను ఓ హీరోయిన్ గా తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.