ఆమె మేయర్ గా వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. పూర్వాశ్రమంలో టీచర్ కావడంతో ఆ ప్రభావం కూడా ఆమె పనితీరు మీద కనిపిస్తోంది. ఆమె విశాఖ వంటి పెద్ద కార్పోరేషన్ కి మేయర్ అయ్యారు.
అందుకే మంచి చెడ్డలను కూడా టీచ్ చేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు మేయర్ హరి వెంకట కుమారి. ప్రతీ సోమవారం నో ప్రైవేట్ వెహికిల్స్ అంటూ ఆమె కార్పోరేషన్ అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఆ రోజున పబ్లిక్ వెహికిల్ ని ఉపయోగించాలని, లేదా సైకిల్ మీదనే ఆఫీస్ కి రావాలని సూచించారు. ఇక ప్రతీ సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి వచ్చే ప్రజలు కూడా సొంత వాహనాలు వదిలేసి ప్రభుత్వ వాహానాలనే ఆశ్రయించాలని ఆమె కోరారు.
దీని వల్ల అంతకంతకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ఎంతో కొంత అయినా తగ్గుతుంది అని మేయర్ అంటున్నారు. కాగా మేయర్ నిర్ణయం పట్ల జనాలు సైతం ఫుల్ హ్యాపీస్ అవుతున్నారు.
ఈ విధంగా చేస్తే సిటీలో ట్రాఫిక్ కష్టాలు ఎంతో కొంత అయినా తీరుతాయని అంటున్నారు. అధికారులు ముందు ఆచరిస్తే ప్రజలు కూడా సొంత వాహనాలు వదిలి ప్రభుత్వ వాహనాలకు అలవాటు పడతారని అంటున్నారు.