సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ అదృష్టం కలిసొచ్చి దేశ అత్యున్నత చట్టసభ సభ్యుడయ్యారు. వైఎస్సార్‌సీపీ హవాలో ఆయన హిందూపురం ఎంపీగా గెలుపొందారు. మొదటి నుంచి ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమే. పొలిటీషియన్‌గా మారినప్పటికీ, ఆయన మాత్రం పోలీస్ భాషను మార్చుకోలేదు. నాగరిక సమాజం ఏమనుకుంటుందో అనే భయభక్తులు కూడా ఆయనలో మచ్చుకైనా కనిపించవు.
ఇవాళ సాయంత్రం మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప స్పష్టత ఇచ్చారు. దీంతో మాధవ్‌లో ఉత్సాహం తన్నుకొచ్చింది. మీడియాతో మాట్లాడుతూ తనపై దుష్ప్రచారం చేశారంటూ ఎల్లో మీడియా, టీడీపీ నేతలపై ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలు ఎదిగితే ఓర్వలేని పార్టీ అది అన్నారు. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
అయితే గోరంట్ల మాధవ్‌నే టార్గెట్ ఎందుకు చేసుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన బూతులకు పని పెట్టారు. ఎల్లో మీడియాధిపతులు, అలాగే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లను ఉద్దేశించి “చెత్త నా కొడుకులు, ముండ నా కొడుకులు, ముసలి నా కొడుకులు, దొంగ నా కొడుకులు, బ్రోకర్ నా కొడుకులు, పాడు ముండా కొడుకల్లారా” అంటూ యథేచ్ఛగా నోరు పారేసుకున్నారు.
అనంతపురం ఎస్పీ క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో మాధవ్‌కు భారీ ఊరట లభించింది. ఈ నేపథ్యంలో తనపై దుష్ప్రచారం చేశారనే ఆవేదన కూడా ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ నిరసన ప్రకటించడానికి కనీస గౌరవ ప్రదమైన భాషను వాడి వుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుండగా మాధవ్ మరోసారి కమ్మ సామాజిక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంత మంది దుర్మార్గమైన కమ్మ నా కొడుకులు చేసిన పని ఇది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం గమనార్హం. కనీసం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్‌కు గౌరవం ఇచ్చి, సంస్కారవంతంగా మాట్లాడి వుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.