‘శృతి’ కుదరలేదా?

గబ్బర్ సింగ్ లో పవన్ సరసన మెరిసి, మాంచి మార్కులు కొట్టేసింది శృతిహాసన్. మళ్లీ అదే జోడీ కాటమరాయుడు లో కనిపించినా, గబ్బర్ సింగ్ స్పార్క్ మాయమైంది. మళ్లీ ఇన్నాళ్ల తరువాత అదే జోడీ…

గబ్బర్ సింగ్ లో పవన్ సరసన మెరిసి, మాంచి మార్కులు కొట్టేసింది శృతిహాసన్. మళ్లీ అదే జోడీ కాటమరాయుడు లో కనిపించినా, గబ్బర్ సింగ్ స్పార్క్ మాయమైంది. మళ్లీ ఇన్నాళ్ల తరువాత అదే జోడీ తెరపై కనిపిస్తుందని వార్తలు వినిపించాయి. వకీల్ సాబ్ సినిమా కోసం పవన్-శృతి హాసన్ జోడీ మళ్లీ కనిపిస్తుందని వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు మళ్లీ అనుమానాలు ముుసురుకున్నాయి. కరోనా కారణంగా సినిమా ఆలస్యమైనందున శృతి డేట్ లు దొరుకుతాయో, దొరకవో అన్న అనుమానం వ్యక్తం చేసారు దర్శకుడు శ్రీరామ్ వేణు. ఒకవేళ శృతి డేట్లు దొరక్కపోతే, వెయిట్ చేసేది లేదని కూడా క్లారిటీ ఇచ్చేసారు.

నిజానికి ఇలా చెప్పరు. శృతి డేట్లు దొరకవు అని పక్కా అయిన తరువాతే ఇలాచెబుతారు ఎవరైనా. ఎందుకంటే ఇలా అన్నారని తెలిస్తే, శృతి అలిగే ప్రమాదం వుంది. ఇది శ్రీరామ్ వేణుకు తెలియని విషయం కాదు. అయినా అలా అన్నారు అంటే శృతి వకీల్ సాబ్ లో చేయడం అనుమానమే అన్నమాట. ఏమిటో ఈ మధ్య బాలయ్య, చిరు, పవన్ లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టం అవుతోంది.

పంజాబ్ పోలీసులు ఏంచేసారో చూస్తే షాక్ అవుతారు