చాన్నాళ్లకు వార్తల్లోకి కలర్స్ స్వాతి

కలర్స్ కార్యక్రమంతో అందరినీ ఆకట్టుకుని, స్వామిరారా, కార్తికేయ లాంటి సినిమాలతో సినిమాల్లో సెటిలై, ఆ తరువాత పెళ్లి చేసుకుని, విదేశాలకు వెళ్లిపోయింది స్వాతి. ఇండస్ట్రీలో వున్నన్నాళ్లు కలర్స్ స్వాతి ఎప్పడూ వార్తల్లో వుంటూ వచ్చేది.…

కలర్స్ కార్యక్రమంతో అందరినీ ఆకట్టుకుని, స్వామిరారా, కార్తికేయ లాంటి సినిమాలతో సినిమాల్లో సెటిలై, ఆ తరువాత పెళ్లి చేసుకుని, విదేశాలకు వెళ్లిపోయింది స్వాతి. ఇండస్ట్రీలో వున్నన్నాళ్లు కలర్స్ స్వాతి ఎప్పడూ వార్తల్లో వుంటూ వచ్చేది. ఏవో వార్తలు, లేదంటే గ్యాసిప్ లు వాటి ఆమె రుసరుసలు , స్పందనలు ఇలా వుండేది వ్యవహారం.

పెళ్లయిన తరువాత ఒక్కసారి మాత్రమే మీడియాలో కనిపించింది. ఓ ఛానెల్ లో తన భర్తతో కలిసి తమ అనురాగ దాంపత్యం పై ప్రత్యేక షో చేసింది. ఆ తరువాత మళ్లీ సైలంట్. కానీ ఇన్నాళ్లకు మీడియా దృష్టి మళ్లీ స్వాతి వైపు మళ్లింది.

దీనికి కారణం మరేం కాదు, ఆమె ఇన్ స్టా అక్కౌంట్ లో @swathi194 ఆమె ఫ్యామిలీ పిక్స్ అన్నీ ఒక్కసారిగా మాయం కావడమే అన్నది పాయింట్. టీవీ ఛానెల్ లో అత్యంత అనురాగ దాంపత్యాన్ని విడియో సాక్షిగా చూపించి, ఇన్ స్టాగ్రామ్ నుంచి ఫొటోలు అన్నీ ఎందుకు లేపేసినట్లు అన్నది మీడియా జనాల అనుమానం. 

నిప్పు లేకుండా పొగరాదు.. కారణం లేకుండా ఫొటోలు మాయం కావు అనే సూత్రం ప్రకారం గుసగుసలు వినిపించడం ప్రారంభమయ్యాయి.

పంజాబ్ పోలీసులు ఏంచేసారో చూస్తే షాక్ అవుతారు