మాజీ ప్రేమికులు ఫ్రెండ్స్ గా ఉండకూడదా!

ఇలాంటి స్టేట్ మెంట్స్ చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం ఫేస్ చేయడం చాలా కష్టం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్నే ఎదుర్కొంటోంది హీరోయిన్ హన్సిక. ఒకప్పుడు నటుడు శింబుతో పీకల్లోతు ప్రేమలో…

ఇలాంటి స్టేట్ మెంట్స్ చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం ఫేస్ చేయడం చాలా కష్టం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్నే ఎదుర్కొంటోంది హీరోయిన్ హన్సిక. ఒకప్పుడు నటుడు శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అతడు ఓ మంచి స్నేహితుడు మాత్రమే అంటోంది.

లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైన హన్సిక, తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఎక్కువమంది శింబు గురించే ప్రశ్నించారు. సెషన్ ప్రారంభంలో అలాంటి ప్రశ్నల్ని స్కిప్ చేసిన హన్సిక.. వరుసగా శింబు గురించే అడిగేటప్పటికి ఇక రియాక్ట్ అవ్వక తప్పలేదు. ప్రేమికులుగా విడిపోతే ఫ్రెండ్స్ గా కలిసి ఉండకూడదా అంటూ కాస్త సీరియస్ గానే రివర్స్ లో ప్రశ్నించింది.

శింబు-హన్సిక ప్రేమ గురించి ఎవర్ని అడిగినా చెబుతారు. వీళ్లు ఏ రేంజ్ లో ప్రేమించుకున్నారంటే.. ఒక దశలో వీళ్ల ఎఫైర్ పెళ్లి వరకు వెళ్లింది. సరిగ్గా అక్కడే వీళ్లిద్దరూ విడిపోయారు. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. కట్ చేస్తే, మళ్లీ ఇన్నాళ్లకు శింబుతో కలిసి ఓ సినిమా చేస్తోంది హన్సిక. అందులో శింబుది గెస్ట్ రోలే అయినప్పటికీ అది హాట్ టాపిక్ గా మారింది.

అందుకే ఆన్ లైన్లోకి వచ్చిన వెంటనే అంతా శింబు గురించే అడగడం మొదలుపెట్టారు. మళ్లీ ప్రేమ మొదలైందా అంటూ ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం శింబు తనకు మంచి స్నేహితుడు మాత్రమే అంటున్న హన్సిక.. ఇద్దరు ఎక్స్-లవర్స్ ఫ్రెండ్స్ గా ఉండకూడదా అని ప్రశ్నిస్తోంది.

నీ మనవడు దేవాన్ష్ ని తెలుగు మీడియంలో చేర్పించు