గోపీచంద్ మలినేని సినిమా అంటే మాంచి పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ వుండాల్సిందే. క్రాక్, వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాలతో ఇది ఆనవాయతీగా, అలవాటుగా మారింది. అదే ఆనవాయితీ, అలవాటు మరోసారి కొనసాగబోతోంది రవితేజ-మైత్రీ మూవీస్ సినిమాతో. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కూడా ఓ పవర్ పుల్ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు హీరోయిన్ గా శ్రీలీల ను తీసుకున్న సంగతి తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తారు. జైలర్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన విజయ్ కార్తీక్ కన్నన్ ఈ సినిమాకు వర్క్ చేయబోతున్నారు. ఓ డిఫరెంట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కే ఈ సినిమా షూట్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలవుతుంది.
క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల గోపీచంద్ మలినేని తమిళ హీరో విజయ్ తో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల అది పక్కకు వెళ్లింది. థమాకా తరువాత సరైన హిట్ కోసం చూస్తున్న రవితేజ దగ్గర నుంచి పిలుపు రావడం, ఆ ప్రాజెక్ట్ ఫైనల్ కావడం జరిగిపోయింది.