బాబు సొంతడబ్బా.. వీక్ నెస్ ను చాటిందే?!

పార్టీ ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టబోయే ముందు.. దానిని కుప్పంలో ప్రారంభించడం చంద్రబాబునాయుడుకు ఒక ఆనవాయితీ అట! ఈ విషయం స్వయగా ఆయనే వెల్లడించారు. అది కూడా కుప్పం కార్యకర్తల మీటింగులోనే చెప్పుకొచ్చారు.  Advertisement నిజమే…

పార్టీ ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టబోయే ముందు.. దానిని కుప్పంలో ప్రారంభించడం చంద్రబాబునాయుడుకు ఒక ఆనవాయితీ అట! ఈ విషయం స్వయగా ఆయనే వెల్లడించారు. అది కూడా కుప్పం కార్యకర్తల మీటింగులోనే చెప్పుకొచ్చారు. 

నిజమే చెప్పారో.. కుప్పం కార్యకర్తల ముఖప్రీతి కోసం చెప్పారో తెలియదు! కుప్పం అనేది తెలుగుదేశానికి ప్రయోగశాల అనే కితాబు ఇచ్చారు. ఆ కితాబు నిజమే అయితే.. తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరమైన పతనావస్థలో ఉన్నదో చంద్రబాబు మాటలే తెలియజెపుతున్నాయి.

జగన్ ప్రభుత్వం మీద బురద చల్లడానికి తెలుగుదేశం చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో జరగలేదని చంద్రబాబు స్వయంగా చెప్పుకొచ్చారు. 

అంటే.. బాబు పిలుపు ఇచ్చిన ఉద్యమాన్ని ఆయన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని చాలా క్లియర్ గా అర్థమవుతోంది. పైగా..జగన్ మీద బురద చల్లే తెలుగుదేశం ఎజెండాను.. ఆయన సొంత నియోజకవర్గంలోని ప్రజలు కూడా ఛీత్కరించుకుంటున్నారని స్పష్టం అవుతోంది.

కుప్పంలో కార్యకర్తలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, పార్టీ కష్టకాలంలో పనిచేసే నాయకులు కావాలని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో నాయకుల పనితీరును బేరీజు వేసి భవిష్యత్తులో వారికి ఎలాంటి స్థానం ఇవ్వాలో చంద్రబాబునాయుడు డిసైడ్ అవుతారట. 

ఏడుసార్లుగా కుప్పంలో గెలుస్తున్న ఈ పెద్దమనిషి.. ఇప్పటికీ.. లోకల్ కార్యకర్తల్ని బేరీజు వేసే స్థితిలోనే ఉన్నారంటే ఆయన నియోజకవర్గం మీద ఎంత శ్రద్ధతో ఉన్నారో అర్థమవుతోంది. అక్కడి కార్యకర్తలు ఆయన మీద విసిగిపోయి ఉన్నారని కూడా తెలుస్తోంది.

ఒకవైపు కుప్పంలో పార్టీ ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నదో.. చంద్రబాబు స్వయంగా పార్టీ కార్యకర్తలతో చెబుతూనే.. మరో వైపు.. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదులో కుప్పం ప్రథమ స్థానంలో ఉన్నదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ఒక్క మాట చాలు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎంత వీక్ అయిందో అర్థం కావడానికి. 

కార్యకర్తలు పనిచేయడం లేదని బాబు ఆవేదన చెందిన కుప్పమే ప్రథమ స్థానంలో ఉంటే.. ఆ పార్టీ మిగిలిన రాష్ట్రమంతా ఎంత దయనీయ స్థితిలో ఉన్నదో కదా.. అనిపిస్తోంది.

అతి గొప్ప ట్విస్టు ఏంటంటే.. చంద్రబాబు నిర్వహించిన ఈ సొంత నియోజకవర్గ సమీక్ష టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి పలువురు నాయకులు డుమ్మా కొట్టారు. టెలి కాన్ఫరెన్స్ అంటేనే .. ఫోను ఆన్ చేసి.. పక్కన పెట్టేసి.. బాబు చెప్పే సొద మొత్తం ఆలకిస్తూ ఉండడమే. 

ఈ మాత్రం దానికి కూడా బోలెడంత మంది నాయకులు డుమ్మా కొట్టారంటే..కుప్పం నియోజకవర్గంలో బాబు ప్రభ అంతరించినట్లే చాలా స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.

2 Replies to “బాబు సొంతడబ్బా.. వీక్ నెస్ ను చాటిందే?!”

Comments are closed.