గేమ్ ఛేంజర్ లీక్స్.. ఆ ఇద్దరు అరెస్ట్

గుంటూరు కారం లీక్స్ జరిగిన టైమ్ లోనే గేమ్ ఛేంజర్ లీక్స్ కూడా జరిగాయి. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా నుంచి ఓ సాంగ్ బిట్ లీక్ అయింది. ఇప్పుడా…

గుంటూరు కారం లీక్స్ జరిగిన టైమ్ లోనే గేమ్ ఛేంజర్ లీక్స్ కూడా జరిగాయి. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా నుంచి ఓ సాంగ్ బిట్ లీక్ అయింది. ఇప్పుడా సాంగ్ ను లీక్ చేసిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

గేమ్ ఛేంజర్ సాంగ్ బిట్ లీక్ అయిన వెంటనే నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, లోతుగా దర్యాప్తు చేసి సాంగ్ లీక్ కు కారణమైన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తులు ఇద్దరిపైన ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా పోలీసులతో పాటు గేమ్ ఛేంజర్ మేకర్స్ మరోసారి హెచ్చరిక జారీచేశారు. ఇకపై ఎవరైనా లీకులకు పాల్పడితే, ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

గేమ్ ఛేంజర్ నుంచి లీక్ అయిన ఆ సాంగ్ ను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, సముద్రఖని, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు ఇంకా విడుదల తేదీ ఫిక్స్ చేయలేదు.