రంగ్ దే….ఓవర్ సీస్ 1.5 కోట్లు

తెలుగు సినిమా మెల్లగా గాడిలో పడుతోంది. ఓవర్ సీస్ మార్కెట్ ఓపెన్ కావడంతో రేట్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. జాతిరత్నాలు సినిమా ఫలితం, కలెక్షన్లు మార్కెట్ కు బలం చేకూరుస్తున్నాయి.  Advertisement నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్…

తెలుగు సినిమా మెల్లగా గాడిలో పడుతోంది. ఓవర్ సీస్ మార్కెట్ ఓపెన్ కావడంతో రేట్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. జాతిరత్నాలు సినిమా ఫలితం, కలెక్షన్లు మార్కెట్ కు బలం చేకూరుస్తున్నాయి. 

నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించిన రంగ్ దే సినిమా ఓవర్ సీస్ హక్కులు ఫారస్ ఫిలింస్ సంస్థ దక్కించుకుంది. 1.5 కోట్లకు సినిమా ఓవర్ సీస్ హక్కులు విక్రయించేసారు. 

ఇప్పటికే రంగ్ దే తెలుగు థియేటర్ మార్కెట్, నాన్ థియేటర్ హక్కులు సమస్తం విక్రయించేసారు. వీటి ద్వారా దాదాపు 36 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు ఓవర్ సీస్ ఆదాయం అదనంగా లభించినట్లే. సినిమా నిర్మాణానికి 32 కోట్ల వరకు అయింది. 

దేవీశ్రీ ప్రసాద్, పిసి శ్రీరామ్ వంటి టెక్నికల్ కాస్ట్ వుండడం, కీర్తి సురేష్ హీరోయిన్ కావడంతోనూ, కరోనా టైమ్ ఖర్చులు అన్నీ కలిసి సినిమా బడ్జెట్ ను పెంచేసాయి. ఈ నెల 26న రంగ్ దే థియేటర్లలోకి వస్తుంది.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్