అవెంజర్స్ సినిమా సునామీలా థియేటర్ల మీద పడింది. దాని తాకిడి ముందే ఊహించి దాదాపు 15 రోజులపాటు చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు ఏవీ ఆ దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడ్డాయి. ముందే విడుదలైన సినిమాలు వాటి రన్ ను సింగిల్ స్క్రీన్స్ కు పరిమితం చేసుకుని, మల్టీ ఫ్లెక్స్ లను తగ్గించుకున్నాయి.
అయితే అవెంజర్స్ హడావుడి ఎన్నిరోజులు వుంటుంది? అన్నది ఫ్రశ్న. ఎందుకంటే సరిగ్గా రెండు వారాల తరువాత మహేష్ సినిమా మహర్షి రాబోతోంది. సాధారణంగా తెలుగునాట సరైన హిట్ వస్తే నాలుగు వారాల పాటు థియేటర్లలో వుంటుంది. మజిలీ సినిమా ఇప్పుడు నాలుగో వారంలో ప్రవేశించింది. అలాగే జెర్సీ, కాంచన రెండోవారంలో వున్నాయి.
అయితే మహర్షికి థియేటర్లతో సమస్యరాదు. అవెంజర్స్ కూడా సమ్మర్ కోసం నాలుగువారాలు థియేటర్లలో వున్నా కూడా వచ్చిన నష్టం మామూలుగా అయితే లేదు. బి, సి సెంటర్లలో కావాల్సినన్ని స్క్రీన్లు, థియేటర్లు వున్నాయి.
కానీ సమస్య ఏమిటంటే, మహర్షి వ్యవహారం చూస్తుంటే మల్టీఫ్లెక్స్ సినిమాగా కనిపిస్తోంది. అవెంజర్స్ కు మల్టీఫ్లెక్స్ లతో గట్టి అగ్రిమెంట్ వుంది. ఇన్ని స్క్రీన్ లు, ఇన్ని షోలు ఇవ్వాలని నెలలముందే ఒప్పందాలు చేసుకున్నారు.
అవెంజర్స్ కు మంచి వసూళ్లు వస్తుంటే దాన్ని కాదు అని, మహర్షికి ఎన్ని స్క్రీన్లు కేటాయించగలరు అన్నది పాయింట్. ఎమ్ సెట్ తో పాటు అనేకరకాల పరీక్షలు అయిపోయే టైమ్ ఇది. పక్కాగా హాలీడే టైమ్. అందువల్ల అవెంజర్స్ కలెక్షన్లు, దూకుడు ఎలా వుంటుంది అన్నదాన్ని బట్టి, మల్టీ ఫ్లెక్స్ ల్లో మహర్షికి స్క్రీన్లు దొరకడం అన్నది ఆధారపడి వుంటుంది.