ఇద్దరు కొత్తవాళ్లతో.. శర్వా

మిగిలిన హీరోలకు శర్వానంద్ కు కాస్త తేడా వుంది. షూటింగ్ కు వెళ్లాలంటే చిన్నపిల్లాడు బడికి వెళ్లినట్లే. కాస్త మారాం తప్పదని ఇండస్ట్రీ టాక్. వరుసగా కాస్త లెంగ్తీ షెడ్యూలు చేస్తే, కొన్నాళ్లయినా హాలీడేస్…

మిగిలిన హీరోలకు శర్వానంద్ కు కాస్త తేడా వుంది. షూటింగ్ కు వెళ్లాలంటే చిన్నపిల్లాడు బడికి వెళ్లినట్లే. కాస్త మారాం తప్పదని ఇండస్ట్రీ టాక్. వరుసగా కాస్త లెంగ్తీ షెడ్యూలు చేస్తే, కొన్నాళ్లయినా హాలీడేస్ కావాల్సిందే. లీజర్ గా, హడావుడి లేకుండా, ప్రశాంతంగా సినిమాలు చేయడం శర్వా నైజం.

అలాంటిది శర్వానంద్ ఒక్కసారిగా తన స్టయిల్ మార్చేసాడా? అనిపిస్తోంది. ఎందుకంటే చాలాకాలంగా సెట్ మీద వున్న సుధీర్ వర్మ సినిమా విడుదలకు సిద్దం అవుతుంటే, 96 రీమేక్ షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్ చకచకా జరుగుతుంటే, మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. అది కూడా ఇద్దరు కొత్తదర్శకులకు.

14రీల్స్ పతాకంపై ఓ కొత్త డైరక్టర్ తో సినిమా ఒకే చేసాడు. అది సంక్రాంతికి రెడీ చేయాలని కచ్చితంగా చెప్పేసాడని వార్తలు వచ్చాయి. ఇదికాక తమిళ-తెలుగు భాషల్లో తమిళ నిర్మాత ఫ్రభుకు ఓ సినిమాకు ఓకే చెప్పేసాడట. దానికి కూడా ఓ కొత్త దర్శకుడే పనిచేస్తాడు.

ఈ రెండు కథలు బాగా నచ్చి శర్వా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు మిగిలిన హీరోల మాదిరిగానే శర్వా కూడా సినిమాల లైన్ ముందుగా పక్కాగా ప్లాన్ చేసుకోవడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది చూస్తుంటే. యంగ్ హీరోలు ఏడాదికి మూడు సినిమాలు కనీసం చేస్తూ వెళ్తుంటే నిర్మాతలకు మంచిది, ఇండస్ట్రీకి మంచిదే.

ఆ మూడు లోక్ సభ స్థానాల్లో భారీగా క్రాస్ ఓటింగ్!