ఆంధ్రప్రదేశ్ లో 329కు పెరిగిన కరోనా కేసులు

ఈరోజు ఉదయం 10 గంటల నాటికి ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కు పెరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల నాటికి 15 కొత్త…

ఈరోజు ఉదయం 10 గంటల నాటికి ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కు పెరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల నాటికి 15 కొత్త కేసులు వెలుగుచూశాయి. వీటిలో నెల్లూరులో 6, కృష్ణాలో 6 పాజిటివ్ కేసులుండగా.. చిత్తూరులో 3 కేసులు నమోదయ్యాయి. కర్నూలు నుంచి కొత్తగా పాజిటివ్ కేసులు బయటపడకపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

మరోవైపు ఇప్పటివరకు 6 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా నుంచి ఇద్దరు… ఈస్ట్, నెల్లూరు, ప్రకాశం, విశాఖ నుంచి చెరో ఒకరు చొప్పున డిశ్చార్జ్ అయినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వ్యక్తుల్లో 48 శాతం మంది 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయష్కులు ఉన్నారు. ఇక 41 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు 36శాతంగా ఉన్నారు. కరోనా పాజిటివ్ బాధితుల్లో 20 ఏళ్ల లోపు వ్యక్తులు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు కలిపి 16శాతంగా ఉన్నారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని, కాకపోతే అదింకా ప్రాథమిక దశలో ఉందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు లేదా ఢిల్లీ ప్రార్థనల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారానే కరోనా సోకింది. ఇప్పుడు సామాజిక వ్యాప్తి కూడా ప్రారంభమైనట్టు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 14 తర్వాత కూడా విజయవాడ, గుంటూరు, కర్నూలు లాంటి హాట్ స్పాట్స్ లో ఆంక్షలు కొనసాగుతుందని ప్రభుత్వం  స్పష్టంచేసింది. 

బన్నీ బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా