సిగ్గు అనిపించడం లేదా?

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు అంటారు కవి కృష్ణశాస్త్రి తన భావ కవిత్వ ధోరణి గురించి, అభ్యుదయ వాదుల విమర్శలు విని. ఆయన పాపం,తన పంథాతనది అని…

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు అంటారు కవి కృష్ణశాస్త్రి తన భావ కవిత్వ ధోరణి గురించి, అభ్యుదయ వాదుల విమర్శలు విని. ఆయన పాపం,తన పంథాతనది అని చెప్పడానికి అలా అనివుంటారు.

కానీ తెలుగునాట ఓ ప్రింట్ మీడియా, ఓ వెబ్ మీడియా వైఖరి చూస్తుంటే అస్సలు సిగ్గు అన్నది వదిలేసారని అర్థం అయిపోతుంది. నారా లోకేష్ కనుసన్నలలో నడుస్తాయని పేరు పడిన ఈ ప్రింట్ మీడియా, వెబ్ మీడియా కరోనా నేఫథ్యంలో కూడా వారి అక్కసును ఎలా వెళ్లగక్కాలో తెలియక కిందా మీదా అయిపోతున్నాయి. ఈ అయోమయంలో అడ్డగోలు రాతలు రాస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోదాదాపు ఒకటే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ధనిక రాష్ట్రమయిన తెలంగాణలో డబ్బులు లేవని చెప్పి సగం జీతాలే ఇస్తున్నారు.

తెలంగాణలో కరోనా కల్లోలం ఆంధ్ర కన్నా ఎక్కువ వుంది.

అయితే ఈ పచ్చరంగు కళ్లకు పూసుకున్న వెబ్ మీడియాకు, ప్రింట్ మీడియాకు అవేం కనిపించవు.

తెలంగాణలో ఆ రోజు అంకె వేసి, ఇన్ని కేసులు అని రాస్తారు

ఆంధ్రలో మొత్తం అంకె వేసి ఇన్ని అంకెలు అని రాస్తారు.

తెలంగాణలో జీతాల గురించి మాట్లాడడానికి కూడా దమ్ము ధైర్యం చాలదు.

ఆంధ్రలో నిధులు వుండీ జీతాలు ఇవ్వడం లేదని రాస్తారు.

ఇదే 'కుల' మీడియా మొన్నటి వరకు ఆంధ్ర దివాలా తీసేసింది, డబ్బులు లేవు. జగన్ వచ్చి దివాలా తీయించేసాడు. అప్పులు చేసేస్తున్నాడు. అని ఊదరగొట్టాయి. 

ఇప్పుడు అస్సలు సిగ్గు ఎగ్గు అన్నది లేకుండా డబ్బులున్నా జీతాలు ఇవ్వడం లేదు అని రాస్తాయి.

ఇప్పుడు కొత్తగా కేంద్రం డబ్బులిస్తుంటే జగన్ వెయ్యి వంతున ఇస్తున్నట్లు కలర్ ఇస్తున్నారు అంటున్నారు.

మరి చాలా అంటే చాలా ఏళ్ల క్రితం ఎన్నికల ముందు దీపం పథకం అని చంద్రబాబు పెట్టి, మహిళలకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. అప్పట్లో ఆ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది కేంద్రమే. ప్రతి రాష్ట్రానికి కిరోసిన్ కు బదులు ఇన్ని కనెక్షన్లు అని కేటాయిస్తే బాబు దానికి ఇలా పచ్చ రంగు పూసారన్న సంగతి వీటికి తెలియదా?

అన్న క్యాంటీన్లకు పచ్చరంగులు వేసాయన్న వైనం గుర్తు వుందా లేదా?

బాబుగారు ఆంధ్రలో అడుగుపెట్టకుండా హైదరాబాద్ ఇంట్లో తలదాచుకున్నారు. పోనీ ఆయనది 70 ఏళ్ల రేంజ్. కరోనా ఎఫెక్ట్ అలాంటి వాళ్లకే ఎక్కువుంటుంది. అందుకే బయటకు రావడం లేదు అని సరిపెట్టుకుందాం? మరి లోకేష్ కు ఏమయింది?

ఇవన్నీ ఈ కుల వెబ్ మీడియా, ప్రింట్ మీడియాలకు కనిపించవు.ఎంత సేపూ ఈ సంక్షొభ సమయంలో కూడా జగన్ గురించి వెంట్రుకలు ఎలా పీకాలన్న యావే.ఇంతలా సిగ్గు వదిలేసిన వైనం ఈ మీడియాలదేనేమో?

మనమంతా ఒక్కటే అని చాటుదాం