బొక్కసం లెక్కలు అయ్యన్న తమ్ముడికి కావాలట!

ఎంతసేపూ వైసీపీ సర్కార్ మీద పడి ఏడవడం తప్పితే జనాలకు చేసిందేంటి అని ఓ వైపు తెలుగు తమ్ముళ్ళకు చీత్కారాలు ఎదురవుతున్నా బుద్ధి మాత్రం  మారడంలేదు. తెల్లారిలేస్తే మీడియా మీటింగులు పెట్టి మరీ జగన్ని,…

ఎంతసేపూ వైసీపీ సర్కార్ మీద పడి ఏడవడం తప్పితే జనాలకు చేసిందేంటి అని ఓ వైపు తెలుగు తమ్ముళ్ళకు చీత్కారాలు ఎదురవుతున్నా బుద్ధి మాత్రం  మారడంలేదు. తెల్లారిలేస్తే మీడియా మీటింగులు పెట్టి మరీ జగన్ని, ఆయన పాలనను తిట్టకుంటే అసలు తోచడంలేదులా ఉంది.

ఇక ఏపీలో సీనియర్ మాజీ మంత్రులకు, రాజకీయాల్లో తలతో సహా మొత్తం పండిపోయాయని చెబుతున్నపచ్చ  నాయకుల తీరు కూడా  ఇలాగే ఉంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు ఇపుడు అర్జంట్ గా ఏపీ ఖజానా గురించిన కంగారు ఎక్కువైపోయింది.

ఏపీలో ఖజానలో ఉన్న సొమ్మెంతో  చెప్పాలంటూ ఆయన గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. జగన్ సర్కార్ ఖజానా ఖాళీ అని చెప్పడమేంటి, కేంద్రాన్ని ఆర్ధిక సాయం చేయమంటూ దేబిరించడమేంటని అయ్యన్నకు కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి.

ఏపీ సంపన్న రాష్ట్రంగానే ఇంకా ఉందని అయిందేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన అయ్యన్నకు సందేహాలేవో ఉన్నట్లున్నాయి. అందుకే ఏం చేశారు ఏపీలో ఉన్న నిధులను అంటూ అమాయకంగా ప్రశ్నలు కురిపిస్తున్నారు.

కేవలం పద్నాలుగు రోజుల్లోనే మొత్తం డబ్బు అంతా ఖర్చు చేసారా అని లేని అధికారం తెచ్చుకుని మరీ గద్దిస్తున్నారు. ఏపీలో ఖజానా ఖాళీ అయితే దానికి బాధ్యత జగన్ సర్కార్ దేనట. అందువల్ల వెంటనే ఎంత మొత్తంలో నిధులు ఉన్నాయి. వాటి వివరాలతో తెల్ల కాగితం అదేనండీ శ్వేతపత్రం విడుదల చేయమని కోరుతున్నారు.

మరి ఈ తెల్లకాగితం కనుక నిజంగా చూపిస్తే అయ్యన్న తమ్ముడు చూసి తెల్ల మొగం వేస్తారేమో.  ఏపీలో ఏది ఏమైనా కానీ, కరోనా వైరస్ రానీ మాకేంటి మేము ఇలాగే  అంటూనే ఉంటాం, పడుతూనే ఉండండి అన్నట్లుంది ఈ సీనియర్ పచ్చ తమ్ముడి వైఖరి.

కరోనా తగ్గేవరకన్నా కొంచెం తగ్గండి బాబు గారూ