మందు తాగారా అనే ప్ర‌శ్న‌కు అన‌సూయ ఏం చెప్పిందంటే…

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా పేరు గాంచిన అన‌సూయ అంద‌ర్నీ మెప్పించి….ప్ర‌స్తుతం వెండి తెర‌పై కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. రంగ‌మ్మ‌త్త‌గా అద‌ర‌గొట్టి చిత్ర రంగంలో అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే చెప్పుకో త‌గ్గ అభిమానులను…

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా పేరు గాంచిన అన‌సూయ అంద‌ర్నీ మెప్పించి….ప్ర‌స్తుతం వెండి తెర‌పై కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. రంగ‌మ్మ‌త్త‌గా అద‌ర‌గొట్టి చిత్ర రంగంలో అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే చెప్పుకో త‌గ్గ అభిమానులను సంపాదించుకున్నారామె. సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడుతార‌నే పేరు సొంతం చేసుకున్న అన‌సూయ‌….తాజాగా ఇన్‌స్టా వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను నిర్మొహ‌మాటంగా అభిమానుల‌తో పంచుకున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

స్వ‌స్థ‌లం ఏది అని అడ‌గ్గా…నల్గొండ అని స‌మాధాన‌మిచ్చారు. ఇంత‌కూ అన‌సూయ అని పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోవ‌చ్చా అనే ప్ర‌శ్న‌కు త‌న నాయ‌న‌మ్మ పేరే…పెట్టార‌ని చెప్పారు.

చేతిపై టాటూకి అర్థ‌మేంట‌ని అన‌సూయ‌ను అభిమానులు ప్ర‌శ్నించారు. దానికామె బ్యూటీ సోల్ డీప్ అని చెప్పారు. అంటే నిశ్చల‌మైన మ‌న‌సు క‌లిగిన అంద‌మైన అమ్మాయి అని వివ‌ర‌ణ ఇచ్చారు. మీరు ఇంత అందంగా ఉండ‌టానికి కార‌ణం ఏంట‌నే ప్ర‌శ్న‌కు త‌న కుటుంబ‌మే అని స‌మాధానం ఇచ్చారు. జ‌బ‌ర్ద‌స్త్‌లో కొత్త ఎపిసోడ్స్ ఉన్నాయా అని అడ‌గ్గా, లేవ‌ని ఆమె జ‌వాబిచ్చారు.

మీలో మీకు బాగా న‌చ్చే ల‌క్ష‌ణం ఏంట‌నే ప్ర‌శ్న‌కు…తాను చాలా ఎమోష‌న‌ల్ అని, అదే త‌న బ‌లం, బ‌ల‌హీన‌త‌గా ఆమె చెప్పారు. ఇదే కొన్ని సార్లు న‌చ్చుతుంది, మ‌రికొన్ని సార్లు న‌చ్చ‌ద‌ని ఆమె వివ‌ర‌ణ ఇచ్చారు. అడిగిన దాని కంటే ఎక్కువే చెప్పారామె.

చివ‌రిగా… “త‌రుణ్ భాస్క‌ర్‌తో క‌లిసి మ‌ద్యం సేవించి ఓ పార్టీలో ర‌చ్చ చేశార‌ట క‌దా” అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. దానికి ఆమె చాలా గ‌మ్మ‌త్తైన స‌మాధానం ఇచ్చారు. ఆ స‌మాధానం ఏంటంటే…”ఈ, అట” అనేవి మీరు మీరు స‌ర‌దాకి అనుకుంటే బాగుంటుందేమో. కానీ నిజాలు వేరే ఉంటాయి. నువ్వు ప‌రిణ‌తి చెందితే అర్థ‌మ‌వుతుంది. నాకు తెలిసి నువ్వు ఇంకా ప‌రిణ‌తి చెందిన‌ట్టు లేవు” అని సున్నితంగానే ఘాటైన స‌మాధాన‌మిచ్చారు.

ఇంటింటికి తిరిగి 1000 రూపాయలు పంచుతున్న రోజా