జగన్ ఊపిరిలూదుతున్నారు కానీ… ?

వైఎస్ జగన్. మాట ఇస్తే తప్పేది లేదు. ఆ విషయంలో ఎవరేమన్నా కూడా జనాలకు మంచి నమ్మకం ఉంది. ఆయన ఒకసారి చెబితే ఇక ఎప్పటికీ వెనక్కి వెళ్ళరు అనే అంతా విశ్వసిస్తారు. విశాఖ…

వైఎస్ జగన్. మాట ఇస్తే తప్పేది లేదు. ఆ విషయంలో ఎవరేమన్నా కూడా జనాలకు మంచి నమ్మకం ఉంది. ఆయన ఒకసారి చెబితే ఇక ఎప్పటికీ వెనక్కి వెళ్ళరు అనే అంతా విశ్వసిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ఆంధ్రులకు గర్వకారణమైన అతి పెద్ద కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం కొద్ది నెలల క్రితం ప్రకటించింది. దాంతో ఉక్కు కార్మిక లోకం అంతా ఒక్కటై ఆందోళలు చేపట్టింది.

ఆ సమయంలో విశాఖ వచ్చిన జగన్ వారితో ప్రత్యేకంగా గంటకు పైగా సమావేశం జరిపి మరీ తానున్నాను అంటూ అభయం ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్ర పెద్దలతో వీలు చూసుకుని మాట్లాడుతాను అన్న జగన్ తాజాగా ఆ పని కూడా పూర్తి చేశారు.

ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో జగన్ గంట సేపు భేటీ వేసి మరీ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. దాని ప్రస్తుత విలువ, గత కీర్తి గురించి కూడా చెప్పారు. తాజాగా కరోనా రెండవ దశలో వేలాది మంది ప్రజల ప్రణాలను ఆక్సిజన్ ఇచ్చి కాపాడిన వైనాన్ని వివరించారు. 

ఉక్కుని నష్టాల‌పాలు కాకుండా కాపాడుకోవాలంటే సొంత గనులను సమకూర్చడం, అప్పులను ఈక్విటీగా మార్చడం వంటి ఆల్టర్నేషన్లను కూడా జగన్  సూచించారు. ఇక కేంద్రంలో నంబర్ టూ గా ఉన్న అమిత్ షా తో కూడా జగన్ జరిపిన చర్చల్లో ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్ ఉంది. 

మరి జగన్ తన వంతుగా ఉక్కుకు ఊపిరులూదుతున్నారు. దీనికి ఉక్కు కార్మిక లోకం కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతోంది. ఇపుడు రియాక్షన్ రావాల్సింది కేంద్ర పెద్దల నుంచే. మరి వారు కనుక ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తే మాత్రం ఉక్కు మనిషిగా జగన్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.