సౌత్ సినిమాలపై ఇప్పటికే రాధికాఆప్టే లాంటి హీరోయిన్లు ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ శృతి మరాటే కూడా చేరింది. పలు తమిళ సినిమాల్లో నటించిన ఈ భామ ఓ నిర్మాతతో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.
“అప్పట్లో అవకాశం రావడమే ఎక్కువ. అందుకే అడిగిన వెంటనే బికినీ ధరించాను. కానీ కాస్త పేరొచ్చిన తర్వాత ఆ బికినీ పిక్స్ పై ట్రోల్ నడిచింది. అవేవీ నేను పట్టించుకోను. కానీ ఓ సినిమా కోసం ఓ నిర్మాత నన్ను సంప్రదించాడు. ముందు చాలా బాగా మాట్లాడాడు. తర్వాత అసలు రంగు బయటపెట్టాడు. కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందని, ఒక రాత్రి పడుకోవాల్సి వస్తుందని అన్నాడు. నీతో ఒక రాత్రి పడుకుంటే హీరోతో ఎవరు పడుకుంటారని అతడ్ని ప్రశ్నించాను.”
ఇలా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది శృతి. ఆ సినిమా నుంచి తనను తప్పించారని, అయినప్పటికీ తను బాధపడలేదని చెప్పుకొచ్చింది. కేవలం మహిళల్లో ధైర్యం నింపేందుకే తను ఈ ఘటనను బయటపెట్టానని చెప్పింది. మీటూ మూమెంట్ వల్ల ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ ఘటనలు బాగా తగ్గాయంటోంది శృతి. ఇందిరా విహ అనే తమిళ సినిమాతో సౌత్ లో ఎంటరైన ఈ భామ, తమిళ్ లో 4 సినిమాలు చేసింది.
ఎక్కువగా మరాఠీలోనే నటించిన శృతి ప్రస్తుతం 2 చిన్న బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి మరింత ప్రచారం కోసం ఆమె ఇలా కాస్టింగ్ కౌచ్ ఘటనల్ని బయటపెడుతోందంటోంది హిందీ మీడియా.
క్రెడిబులిటీని దెబ్బతీస్తున్న టీడీపీ.. పవన్ పాత్ర కూడా చాలానే