నిన్నటికి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సమంత. అదెప్పుడో పెళ్లి టైమ్ లో అనుకున్న మొక్కు అంట. ఇన్నాళ్లకు టైమ్ దొరికింది. అందుకే కాలినడకన తిరుమల వెళ్లి మరీ శ్రీవారిని దర్శించుకుంది. అంతేకాదు.. పనిలోపనిగా ఓ నెలరోజులు రెస్ట్ కూడా తీసుకోబోతోంది సమంత.
అవును.. ఏప్రిల్ నెలంతా సమంత ఖాళీగా ఉండబోతోంది. మజిలీ ప్రచార కార్యక్రమాలు కూడా ముగిస్తే సమంత ఇక ఖాళీనే. చేతిలో సినిమాల్లేక ఆమె ఖాళీగా ఉండడంలేదు. ఆల్రెడీ ఓ బేబీ అనే సినిమాకు ఆమె కాల్షీట్లు కేటాయించింది. ఆ షూటింగ్ మధ్యలో ఉంటుండగానే నెలరోజులు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ గ్యాప్ లో ఆమె నాగచైతన్యతో కలిసి ఓ హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కానీ నాగచైతన్య మాత్రం సమంత అంత ఖాళీగా లేడు. ఆల్రెడీ వెంకీ మామ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఆ సినిమా షెడ్యూల్ కూడా కాస్త ఎడ్జెస్ట్ అయితే నాగచైతన్య ఫ్రీ అవుతాడు. అప్పుడు సమంతకు పని ఈజీ అయిపోతుంది.