ఏజెంట్..స్టయిలిష్ యాక్షన్

సురేందర్ రెడ్డి..అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా ఏజెంట్. భారీ బడ్జెట్ తో తయారవుతున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.  Advertisement స్టయిలిష్ యాక్షన్ సినిమాలకు సురేందర్…

సురేందర్ రెడ్డి..అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా ఏజెంట్. భారీ బడ్జెట్ తో తయారవుతున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. 

స్టయిలిష్ యాక్షన్ సినిమాలకు సురేందర్ రెడ్డి కేరాఫ్ అడ్రస్. ఈ టీజర్ కూడా అలాగే వుంది. ఏజెంట్ గా అఖిల్ ను పరిచయం చేస్తూనే, సినిమా జానర్, మేకింగ్, గ్రాండియర్ అన్నీ టచ్ చేసేలా టీజర్ ను కట్ చేసారు. 

టీజర్ లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ గా కనిపించారు. ఆ క్యారెక్టర్ తో ఏజెంట్ ను పరిచయం చేసారు.

సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించిన ఈ టీజర్ లో అఖిల్ ను స్టయిలిష్ గా పరిచయం చేయడానికే ప్రయత్నించారు. గన్ యాక్షన్ సీన్లలో కూడా స్టయిల్ గా డ్యాన్స్ చేస్తూ కనిపించడం విశేషం.

టీజర్ ను వివిధ భాషల్లో శివకార్తికేయన్, మమ్ముట్టి, కిచ్చా సుదీప విడుదల చేసారు. అన్ని సౌత్ లాంగ్వేజెస్ తో పాటు హిందీలో కూడా ఏజెంట్ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో దర్శకుడు సురేందర్ రెడ్డి భార్య నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.