ది ఫ్యామిలీ మేన్ 2తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది సమంత. ఇందులో ఆమె చేసిన రాజీ పాత్రకు మంచి గుర్తింపు, ప్రశంసలు వస్తున్నాయి. ఈ సిరీస్ తో నటనతో మరో మెట్టు పైకెక్కింది ఈ అక్కినేని కోడలు.
ఈ సందర్భంగా సమంత కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకోవాలి. నిజానికి సమంత నటి అవుదామనుకోలేదు. పరిస్థితుల ప్రభావం, అవసరాల వల్ల ఆమె నటిగా మారాల్సి వచ్చింది.
అవసరాలే నటిగా మార్చేశాయి
సమంత వయసు 20ల్లో ఉన్నప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చవిచూసింది. వాటి నుంచి ఎలా బయటపడాలో ఆమెకు అర్థంకాలేదు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు తనకు ఇష్టం లేకపోయినా చాలా జాబ్స్ చేసింది. అందులో ఒకటి మోడలింగ్. ఆ తర్వాత మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపుకు అనుకోకుండా వచ్చింది. ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీలో ఆమెకు ఎవ్వరూ గాడ్ ఫాదర్స్ లేరు.
క్లాస్ లో అందరి కంటే ఫస్ట్
చెన్నైలో చదువుకుంది సమంత. స్కూల్ లో ఆమె క్లాస్ టాపర్. తన రిపోర్ట్ కార్డ్స్ ను కూడా ఆమధ్య సోషల్ మీడియాలో పెట్టింది ఈ బ్యూటీ. సిటీలోని స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో ఆమె పదో తరగతి పూర్తిచేసింది.
ఫ్యాషన్ లైనింగ్
సమంతకు ప్రత్యేకంగా ఓ ఫ్యాషన్ బొటిక్ కూడా ఉంది. ఆమె ఫ్యాషన్ బ్రాండ్ పేరు సాకి. సమంత, అక్కినేనిలో మొదటి పదాలు కలిసొచ్చేలా ఆ పేరు పెట్టింది. ఏదో పెట్టుబడి పెట్టి వదిలేయకుండా, తన మనసుకు నచ్చినట్టు ఎంతో ఇష్టంగా ఈ బ్రాండ్ ను కొనసాగిస్తోంది సమంత. ఇందులో ప్రత్యేకంగా సమంత కలెక్షన్ కూడా ఉంది. ఆమె ధరించిన మోడల్స్ ఆ సెక్షన్ లో దొరుకుతాయి.
సినిమాలు ఫ్యాషన్ బ్రాండ్ తో పాటు సమంతకు ఛారిటీ సంస్థ కూడా ఉంది. ప్రత్యూష ఫౌండేషన్ ఆమెదే. ఈ ఫౌండేషన్ పై మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సదుపాయాలు కల్పిస్తుంటుంది సమంత. కరోనా టైమ్ లో ఆమె ఫౌండేషన్ చాలా చురుగ్గా పనిచేసింది.
ఇక నాగచైతన్యతో పరిచయం, సాన్నిహిత్యం కోసం సమంత రోజూ జిమ్ చేసేది. చైతూ కోసమే ఆమె జిమ్ చేయడం స్టార్ట్ చేయడం. సెట్స్ తర్వాత చైతూ-సమంత బాగా క్లోజ్ అయింది జిమ్ లోనే.