ఈ సర్వే నిజమేనా?
'ఆరా పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ పలు విషయాలు తెలిపింది. 'ఆరా తెలంగాణ సర్వే' పేరిట చేసిన ఓ సర్వే వివరాలను విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీ విజయం సాధిస్తుంది? టీఆర్ఎస్ మరోసారి విజయ దుందుభి మోగిస్తుందా? కాంగ్రెస్‌కు పూర్వ వైభవం సాధ్యమవుతుందా? దూకుడుగా ముందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తుందా? ఈ సందేహాలు తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే ఉన్నాయి.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. దీనికి మన్న కేసిఆర్ చేసిన కామెంట్ ఎన్నికల జ్వాలాకి మరింత ఆజ్యం పోసింది. ‘ఆరా తెలంగాణ సర్వే’ పేరిట చేసిన ఓ సర్వే వివరాలను విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చింది. తెలంగాణలో రాజకీయ స్థితిగతులు పార్టీల బలబలాలు, ఓటర్ల వైఖరి గురించి ప్రతి మూడు నెలలకు ఓ సారి తెలంగాణలోని 119 నియోజక వర్గాల్లోని మూడో వంతు నియోజక వర్గాల్లో సర్వేలు నిర్వహించామని పేర్కొంది. ఈ విధంగా 2021 నవంబరు నుంచి 2022 జూలై మధ్య మూడు దఫాలుగా తెలంగాణలోని అన్ని నియోజక వర్గాల్లో సర్వే నిర్వహించామని పేర్కొంది. ఈ మూడు విడతల్లో పార్టీలకు వచ్చిన సరాసరి ఓట్ల శాతం గురించి వివరాలు తెలిపింది.
టీఆర్ఎస్ కు 38.88 శాతం, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్ కు 23.71 శాతం, ఇతరులకు 6.91 శాతం ఓట్లు రానున్నట్లు తెలిసిందని పేర్కొంది. 2018 ఎన్నికల్లో 46.87 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్… అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 5 శాతం ఓట్లను కోల్పోయి 41.71 శాతమే సాధించిందని తెలిపింది. తాజా సర్వే ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల కంటే టీఆర్ఎస్ 8 శాతం ఓట్లను కోల్పోయి 38.88 శాతం ఓట్లను పొందనుందని పేర్కొంది.
ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఇక మిగిలినవైఎస్సాఆర్ టీపీ, బీఎస్పి, గురించి ప్రత్యేకంగా వివరాలు ఇవ్వకుండా ఇతరులు అని చూపడం వెనుక వీరిని రాజకీయ పార్టీలుగా గుర్తించనట్లు లేదు అని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సర్వే ఎంత మాత్రం నిజమో తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి చూడాలి.