రామ్ కోసం తమిళ సినిమా

సరైన కథ ఎక్కడ దొరకుతుందా అన్న వేట విపరీతంగా సాగుతోంది. లేటెస్ట్ గా ఓ తమిళ సినిమా హక్కులను హీరో రామ్ కోసం కొనేసారు. ఈ మధ్యనే తమిళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద…

సరైన కథ ఎక్కడ దొరకుతుందా అన్న వేట విపరీతంగా సాగుతోంది. లేటెస్ట్ గా ఓ తమిళ సినిమా హక్కులను హీరో రామ్ కోసం కొనేసారు. ఈ మధ్యనే తమిళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అయింది థడమ్ అనే సినిమా అరుణ్ విజయ్ హీరో. చిన్న బడ్జెట్ తో చిన్నగా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు నమోదు చేస్తోంది. టోటల్ బిజినెస్ అక్కడ 15 కోట్లకు పైగా కనిపిస్తోంది.

దాంతో తెలుగు ఇండస్ట్రీ జనాల కన్ను ఈ సినిమా మీద పడింది. ఇప్పడు ఈ సబ్జెక్ట్ ను తెలుగులో చేయాలని ప్లాన్ చేస్తున్నారు స్రవంతి రవికిషోర్. కాస్త గట్టిపోటీ ఎదుర్కోనే ఆయన ఈ సినిమా హక్కులు సాధించారు. తమిళ సినిమా నిర్మాతలతో ఈ మేరకు డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఇదే ప్రాజెక్టు కోసం పోటీపడిన మరో నిర్మాత టాగోర్ మధు కూడా ఇప్పుడు ఇందులో భాగస్వామిగా వుంటారు. అంటే రవికిషోర్, మధు కలిపి రామ్ హీరోగా ఈ సినిమాను నిర్మిస్తారన్నమాట. ప్రస్తుతం ఓ సినిమాను పూరి జగన్నాధ్ డైరక్షన్ లో చేస్తున్న రామ్, దాని తరువాత ఈ సినిమా మీదకు వస్తారు.

ఓట్లను కొనడంకాదు, మాయమే చేస్తున్నారు!

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే..