టాలీవుడ్ ప్రతిభను ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి. రెమ్యూనిరేషన్ పరంగా ఆయనకు ఎంత వస్తుందో ఎవ్వరికీ తెలియదు. లాభాల్లో భారీ వాటానే రెమ్యూనిరేషన్ అని టాక్. ఆయన ఇంట పిల్ల, పెద్ద అంతా టాలీవుడ్ లోనే పని చేస్తుంటారు. ఆయన సినిమాలు అంటే ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్.
అలాంటి రాజమౌళి ఇప్పడు, ఈ విపత్కర పరిస్థితుల సమయంలో చేయి విదల్చ లేదు. అటు సిఎమ్ ల రిలీఫ్ ఫండ్ కు కావచ్చు, ఇటు సిసిసి కి కావచ్చు. రూపాయి విరాళం అనే ప్రకటన అయితే రాలేదు. పోలీసులకో, డాక్టర్లకో గ్లవుజ్ లు, మరోటి కొనిస్తారట అని టాక్ వినిపిస్తోంది. ఆ సంగతి ప్రభుత్వాలు ఎలాగూ చేస్తున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వాలకు ఆర్థిక అండ కావాలి. అలాగే సినిమా కార్మికులకు అండ కావాలి. దాదాపు డజను మంది వరకు సినిమా రంగం నుంచి ఆదాయం పొందుతున్న కుటుంబం కదా? ఆ మాత్రం ముందుకు రాకపోతే ఎలా అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే టాలెంటెడ్ అగ్రదర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, సుకుమార్, కొరటాల శివ లాంటి వాళ్లు అందరికన్నా ముందే డొనేషన్లు ప్రకటించారు. కానీ వీరందరికన్నా ఫ్యామిలీ ఫ్యామిలీ టాలీవుడ్ లో కోట్ల సంపాదన వున్న రాజమౌళి ఫ్యామిలీ మాత్రం మౌనంగా వుండడం విశేషం.