మహేష్ కు 50 కోట్ల రెమ్యూనిరేషన్?

మహేష్ ఫ్యూచర్ ఫ్రాజెక్టు వ్యవహారం తేలిపోయింది. అనిల్ రావిపూడి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ అయిపోయింది. సుకుమార్ సినిమా పక్కకుపోయింది. ఇక తేలాల్సినది ఓకటే దిల్ రాజు-అనిల్ సుంకరలో ఎవరు ప్రొడక్షన్ చేస్తారు అన్నది.…

మహేష్ ఫ్యూచర్ ఫ్రాజెక్టు వ్యవహారం తేలిపోయింది. అనిల్ రావిపూడి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ అయిపోయింది. సుకుమార్ సినిమా పక్కకుపోయింది. ఇక తేలాల్సినది ఓకటే దిల్ రాజు-అనిల్ సుంకరలో ఎవరు ప్రొడక్షన్ చేస్తారు అన్నది. ఈ అవకాశం మహేష్ ఎవరికి ఇస్తాడు అన్నది కూడా ఒకటి రెండురోజుల్లో తేలిపోతుంది.

అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మహేష్ బాబుకు ఓ హాటెస్ట్ డీల్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు గాను మహేష్ బాబుకు అత్యధిక రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి-మహేష్ కాంబినేషన్ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ జస్ట్ యాభైకోట్లు (మహేష్ రెమ్యూనిరేషన్ కాకుండా) వుంటుందని తెలుస్తోంది.

అయితే జియో టీవీ నుంచి టోటల్ నాన్ థియేటర్ రైట్స్ (ఆల్ లాంగ్వేజెస్ శాటిలైట్, డిజిటల్, ఇతరత్రా అన్నీకలిపి) యాభైకోట్ల మేరకు ఆఫర్ వున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రొడక్షన్ కాస్ట్ అంతా అలా వెళ్లిపోతుంది.  సినిమాకు థియేటర్ రైట్స్ కనీసం వందకోట్లు వుంటాయని అంచనా వేస్తున్నారు.

అందులో మహేష్ కు సగం, మిగిలినది ఇద్దరు నిర్మాతలకు సగం సగం అన్న లెక్కలు వేసారని టాక్ వినిపిస్తోంది. ఆ విధంగా మహేష్ కు 50 కోట్లు ముడతాయన్నమాట. అందుకే ఈ ప్రాజెక్టుకు మహేష్ అంత ప్రయారిటీ ఇస్తున్నారని టాక్.

బాబు ఐదేళ్ల పాలనలో సాధించేది గ్రాఫిక్సే!