సాహో చాప్టర్ 2- గ్రౌండ్ రియాల్టీ

బాహుబలి ప్రభాస్ అప్ కమింగ్ భారీ మూవీ సాహో. ఈ సినిమాకు సంబంధించి చిన్న మేకింగ్ వీడియా రెండోసారి బయటకు వదిలారు. తొలిసారి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా, రెండోది శ్రద్ధాకపూర్ బర్త్ డే…

బాహుబలి ప్రభాస్ అప్ కమింగ్ భారీ మూవీ సాహో. ఈ సినిమాకు సంబంధించి చిన్న మేకింగ్ వీడియా రెండోసారి బయటకు వదిలారు. తొలిసారి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా, రెండోది శ్రద్ధాకపూర్ బర్త్ డే సందర్భంగా. తొలిసారి వదిలిన బైట్ కు మాంచి అప్లాజ్ వచ్చింది. నిజంగానే జనాలు సాహో అన్నారు. రెండోసారి మళ్లీ వదిలారు. వదిలేముందే కాస్త భయపడ్డారు. జనాల్లో వున్న హైప్ ను అందుకోగలమా? లేదా? అని. అప్పటికీ ఈ బైట్ లో శ్రద్ధా ఎక్కువ కనిపిస్తుందని, ప్రభాస్ తక్కువ అని ఇలా రకరకాల కన్ఫ్యూజన్ లీకులు బయటకు వదిలారు.

కానీ తీరాచూస్తే ఆ ఇద్దరి కన్నా దర్శకుడు సుజిత్ ఎక్కువగా కనిపించారు. నిజానికి సుజిత్ కూడా చార్మింగ్ గా బాగానే వుంటాడు. సుజిత్ ను తెలియని, ఆయన ఎలా వుంటాడో తెలియని, బి,సి సెంటర్ల జనాలు కనుక తమ మొబైళ్లలో ఈ బైట్ చూస్తే, సినిమాలో ప్రభాస్ తో పాటు మరో చిన్న హీరో ఎవరో వున్నారేమో అని అనుకునే ప్రమాదం వుంది. సుజిత్ ను అంతలా ప్రొజెక్ట్ చేసారు.

ఆ సంగతి అలా వుంచితే, మీడియా అంతా ఈ రెండో వీడియో బైట్ పట్ల కాస్త పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది. యూట్యూబ్ లో ఈ వీడియో బైట్ ను టీ సిరీస్ దాంట్లో లోడ్ చేస్తే మూడు మిలియన్లు, యువి దాంట్లో ఓ మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. జనాలకు ఈ సినిమా మీద, ఈ వీడియో బైట్ మీద వున్న ఆసక్తికి ఇది నిదర్శనం.

కానీ ఆ రేంజ్ కు ఈ వీడియోబైట్ లేదు అన్న గుసగుసలు మెల్లగా వినిపించడం ప్రారంభమైంది ఇండస్ట్రీలో. తుపాకుల ఎగ్జిబిషన్ అన్నట్లు రకరకాల మోడళ్లు చూపించడం మినహా ఏముంది? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. బిల్లా, రెబల్ సినిమాలు కూడా స్టయిలిష్ గా, గన్స్, మాఫియా వ్యవహారాలతో వుంటాయని కానీ కంటెంట్ దగ్గర ఫెయిల్ అయ్యాయని, సాహో విషయంలో ఆ తప్పు మళ్లీ చేయకూడదని సలహాలు వినిపిస్తున్నాయి.

యువి తన సర్వశక్తులు ఒడ్డి సాహో సినిమా చేస్తోంది. దాదాపు 300 కోట్లు. ఇది చిన్న అమౌంట్ కాదు. చిన్న విషయంకాదు. యువికి సంబంధించినంత వరకు చాలా భారీ రిస్క్. ఈ సినిమాకు మార్కెటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. జస్ట్ 50 కోట్లు టీసిరీస్ అడ్వాన్స్ గా ఇచ్చింది.

అందువల్ల ఇకపై ఇలాంటి చిన్న చిన్న బైట్లు పక్కనపెట్టి, సాలిడ్ గా కంటెంట్ ను కొంచెం అయినా చెప్పే ప్రయత్నం చేయాల్సి వుంది. భారీ సినిమా కాబట్టి, యువి అంటే వున్న అభిమానం కాబట్టి నేరుగా సినిమా జనాలు ఏవీ చెప్పకపోవచ్చు. కానీ నిన్నటి బైట్ మీద మాత్రం ఇండస్ట్రీలో నెగిటివ్ నే ఎక్కువ వినిపిస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలిస్తున్న సర్వేలు!