118 సినిమాతో కాస్త చెప్పుకొదగ్గ ఊరట లభించింది హీరో కళ్యాణ్ రామ్ కు. డొమెస్టిక్ మార్కెట్ లో ఆ సినిమా రేంజ్ కు తగినట్లు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ ఏ సినిమా చేస్తారు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే దర్శకుడు శ్రీవాస్ మాత్రం కళ్యాణ్ రామ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
సాక్ష్యం సినిమాతో వైకుంఠపాళిలో పాము నోట్లోపడి కిందకు వచ్చేసాడు దర్శకుడు శ్రీవాస్. మళ్లీ సినిమా చేయాలంటే డేట్ లు ఇచ్చే హీరో కనిపించడం లేదు. అందుకే కళ్యాణ్ రామ్ కు ఓ స్క్రిప్ట్ వినిపించారట. ఆయన కూడా ఓకె చేసారట. అయితే నిర్మాతలు ఎవరు అన్న దగ్గర ఆగింది సినిమా.
భగవాన్-పుల్లారావు అని శ్రీవాస్ చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ కళ్యాణ్ రామ్ మరేదైనా ఆప్షన్ వుందా? అని చూస్తున్నట్లు బోగట్టా. శ్రీవాస్ ను కళ్యాణ్ రామ్ ఓకె చేసినట్లు, నిర్మాతలు కూడా ఓకె చేయాలి కదా? ఎవరు దొరుకుతారో మరి?