శాకుంతలంపై కరోనా ప్రభావం లేదంట

కరోనాతో సినిమాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అన్ని షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే గుణశేఖర్ మాత్రం తను తీస్తున్న శాకుంతలంపై కరోనా ప్రభావం లేదంటున్నాడు. దానికి ఆయన చెప్పే లాజిక్ కూడా నమ్మేలా ఉంది. Advertisement మైథలాజికల్…

కరోనాతో సినిమాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అన్ని షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే గుణశేఖర్ మాత్రం తను తీస్తున్న శాకుంతలంపై కరోనా ప్రభావం లేదంటున్నాడు. దానికి ఆయన చెప్పే లాజిక్ కూడా నమ్మేలా ఉంది.

మైథలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమాకు ఎంత టైమ్ దొరికినా సరిపోదంటున్నాడు గుణ. ఇప్పటికే సినిమాపై ఏడాది పాటు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశాడట. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల సినిమాకు మెరుగులు దిద్దడానికి మరింత సమయం కలిసొచ్చిందంటున్నాడు.

అయితే దీని వల్ల తన సినిమా రిలీజ్ ఆలస్యమవ్వదంటున్నాడు ఈ దర్శకుడు. ప్రీ-ప్రొడక్షన్ పక్కాగా చేయడం వల్ల.. 6 నెలల్లో షూటింగ్ పూర్తయిపోతుందని.. ఆ తర్వాత మరో 7-8 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కు తీసుకుంటానని చెబుతున్నాడు. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే 2022లో శాకుంతలం థియేటర్లలోకి వచ్చేస్తుందని చెబుతున్నాడు.

ఇక శాకుంతలంలో కీలక పాత్రధారి సమంతపై స్పందిస్తూ.. శ్రీదేవి అందుబాటులో లేదు కాబట్టి సమంతను తీసుకున్నామంటున్నాడు గుణశేఖర్. స్క్రిప్ట్ మొత్తం చదువుతుంటే శ్రీదేవి కళ్లముందు కదలాడారని, ఆమె తర్వాత ఆ లక్షణాలు సమంతలో కనిపించాయని చెబుతున్నాడు.