లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఏమైంది?

ఉన్నట్లుండి ఆర్జీవీ ట్వీట్ బాంబు వేసారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్ హక్కులు వరల్డ్ వైడ్ గా కొనుక్కున్న వారిపై. లక్ష్మీస్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు విశాఖకు చెందిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్…

ఉన్నట్లుండి ఆర్జీవీ ట్వీట్ బాంబు వేసారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్ హక్కులు వరల్డ్ వైడ్ గా కొనుక్కున్న వారిపై. లక్ష్మీస్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు విశాఖకు చెందిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్టి ఎనిమిది కోట్లకు కాస్త అటు ఇటుగా కొనుక్కున్నారు. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ రోజు మరో కోటి రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ మీద ఆర్జీవీతో సైన్ చేయించుకోవాల్సి వుంది.

ఇలాంటి నేపథ్యంలో ఆర్జీవీ వున్నట్లుండి, ట్వీట్ చేసారు. ''లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సంబంధించి, గమనిక. లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న వార్తల్లో నిజాలు లేవు. ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయలేదు. వివరాలు త్వరలో అంటూ ఆయన ట్వీట్ చేసారు.

ఆర్జీవీ ఇలా ఎందుకు ట్వీట్ చేసారు అన్నది ముందుగా ఓమాట అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు తెలియడంలేదు. వివిధ మాధ్యమాల్లో వివిధ అమౌంట్లు పేర్కొంటూ వార్తలు రావడంతో ఆర్జీవీ ఇలా ట్వీట్ చేసారేమో అని కొనుక్కోవాలని అడ్వాన్స్ ఇచ్చినవారు అనుకుంటున్నారు. లేదా సినిమాకు వస్తున్న బజ్, క్రేజ్ చూసి, ఎనిమిది కోట్ల కన్నా ఎక్కువ మొత్తం వస్తుందని ఆర్జీవీ ఆశిస్తున్నారేమో తెలియదు.

వాస్తవానికి ఈ సినిమాకు ఎనిమిది కోట్లు అన్నది మంచి ఆఫర్ అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఈ మేరకు సురేష్ రెడ్డిని ప్రశ్నించగా ఆర్జీవీ ఇలా ఎందుకు ఇచ్చారో తనకు తెలియదని, కనుక్కుంటామని అన్నారు.

మార్చి 22న విడుదల..
ఇదిలావుంటే మార్చి 15న విడుదల చేయాలనుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ఓవారం వెనక్కు జరుపుతున్నారు. పరీక్షల సీజన్ ను దృష్టిలో వుంచుకుని మార్చి 22కు డేట్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.

కళ్యాణ్ రామ్ తన సినిమాపై అంచనాలేంటి..

చంద్రబాబు ఒట్టే గట్టు మీద పెట్టారు.. జనం ఒట్లను పట్టించుకోవాలా!