చంద్రబాబు చేతికి వున్నట్లుండి ఓ ప్లాటినం రింగ్ మెరిసింది. దాంతో చకచకా వార్తలు..కథనాలు.
ఎడం చేతి చూపుడు వేలుకు పెట్టుకున్న ఈ రింగ్ వ్యవహారం ఏమై వుంటుందా అని. ఎడం చేతి చూపుడు వేలుకు అలాంటి రింగ్ పెట్టుకుంటే అధికారం సంప్రాప్తిస్తుందని కూడా కథలు వచ్చేసాయి.
నిజమే కావచ్చు. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబు కు కూడా బాలయ్య మాదిరిగా నమ్మకాలు పట్టుకున్నాయి. వాస్తు, ముహుర్తాలు నమ్ముతున్నారు. అందుకే ఈ రింగ్ కూడా అని అనుకున్నారంతా.
కానీ చంద్రబాబే స్వయంగా ఈ రింగ్ గురించి భలే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అందరి చేతులకు వుంటున్న ఫిట్ నెస్ బాండ్ ల మాదిరేనట ఈ రింగ్ కూడా.
అందులో ఓ చిప్ వుంటుంది. అది తన ఆరోగ్యం మానిటర్ చేస్తూ వుంటుంది. తెల్లవారిన తరువాత డేటా అంతా చూసుకుని తేడా గా వుంటే కరెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు చంద్రబాబు.
ఇలాంటి డివైస్ లు రకరకాలు వచ్చాయి. ఇంకా వస్తాయి అని కూడా చెబుతున్నారు చంద్రబాబు.
ఎంతయినా బాబు టెక్నాలజీ ఫాన్. అందువల్ల ఇలాంటి రింగ్ ను తెప్పించినా తెప్పించి వుండొచ్చు. లేదా నమ్మకాలు అని అంటారో అని ఈ కథ ఏమైనా అల్లారో?