పూరి-చార్మి… డబుల్ ఇస్మార్ట్

కొందరి పద్ధతులు భలే చిత్రంగా వుంటాయి. అర నిమిషంలో ఆలోచించి, నిమిషంలో డెసిషన్ తీసేసుకుంటారు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మరీనూ. ఏ తెల్లవారు ఝామునో, లేదా ఏ పార్టీలోనో ఆలోచన ఇలా వస్తే,…

కొందరి పద్ధతులు భలే చిత్రంగా వుంటాయి. అర నిమిషంలో ఆలోచించి, నిమిషంలో డెసిషన్ తీసేసుకుంటారు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మరీనూ. ఏ తెల్లవారు ఝామునో, లేదా ఏ పార్టీలోనో ఆలోచన ఇలా వస్తే, అలా అమలు చేస్తా వుంటారు. 

పూరి జగన్నాథ్ లేటెస్ట్ గా హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తీసుకున్నారు. ఈ ఇస్మార్ట్ పదం వెస్ట్ గోదావరిలో వినిపించే 'ఎహె' పదం లాంటిది.. గోల్డేహె… స్టయిలెహె.. అంటూ రకరకాల పదాలతో కలిపి వినిపిస్తుంటుంది. ఈ ఇస్మార్ట్ కూడా అలాంటిదే. పక్కా హైదరాబాదీ లోకల్ యాక్సెంట్. చదవితే అర్థంకాదు. వింటేనే తెలుస్తుంది దాని రంజు.

సరే, ఆ సంగతి అలా వుంచితే, ఇప్పుడు ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇంకా తయారీలోనే వుంది. దానికి ఓ సీక్వెల్ అంటూ టైటిల్ ఆలోచించి, రిజిస్ట్రేషన్ కూడా చేసేసారు నిర్మాత చార్మి, దర్శకుడు పూరి కలిసి. ఆ టైటిల్ 'డబుల్ ఇస్మార్ట్' అంట.

రామ్ తో సినిమా రెడీ కావాలి. విడుదల కావాలి. హిట్ కావాలి. అప్పుడు సీక్వెల్. సరే రిజిస్ట్రేషన్ చేస్తే పడి వుంటుందిగా అని చేయించేసి వుంటారు. ఎంతయినా పూరి-చార్మి డబుల్ ఇస్మార్ట్.

పేరుకి ఎన్టీఆర్‌ బయోపిక్‌ కానీ… రెండు భాగాలు

ప్రజారాజ్యం కన్నా పేలవంగా ముగింపు?