మహేష్ కు సరైన ఆప్షన్

గత కొద్ది రోజులుగా ఒకటే గ్యాసిప్ లు. త్రివిక్రమ్ సరైన కథ చెప్పి మహేష్ ను ఒప్పించలేకపోతున్నారని. జర్మనీ కి కథ చెప్పడానికి వెళ్లి, తొమ్మిది రోజులు వుందామనుకున్న త్రివిక్రమ్ మూడు రోజుల్లో వెనక్కు…

గత కొద్ది రోజులుగా ఒకటే గ్యాసిప్ లు. త్రివిక్రమ్ సరైన కథ చెప్పి మహేష్ ను ఒప్పించలేకపోతున్నారని. జర్మనీ కి కథ చెప్పడానికి వెళ్లి, తొమ్మిది రోజులు వుందామనుకున్న త్రివిక్రమ్ మూడు రోజుల్లో వెనక్కు రావడం వెనుక కూడా ఇదే వ్యవహారం వుందని టాక్. 

ఇండియాకు రెండు రోజుల క్రితం వచ్చిన మహేష్ ను కలిసి నెరేషన్ ఇచ్చారు. ఆ పైన మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న వార్తలు వినవచ్చాయి.

గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే మహేష్ కు సరైన ఆప్షన్. ఎందుకంటే నిర్మాతలు రెడీగా వున్నారు కానీ డైరక్టర్లు లేరు. మైత్రీ మూవీస్ ఎంత రెమ్యూనిరేషన్ ఇచ్చి అయినా సినిమా చేయడానికి రెడీ. కానీ దర్శకుడు లేరు. 

కొరటాల శివ..సుకుమార్ లాంటి వాళ్లు కావాలి. త్రివిక్రమ్ సినిమా వదిలి మహేష్ మరో సినిమా చేయాలంటే. అలాంటి వారు ఎవ్వరూ ఖాళీ లేరు. హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి మహేష్ అంత సుముఖంగా లేరని టాక్. అనిల్ రావిపూడి కూడా వేరే చోట లాక్ అయిపోయారు. వంశీ పైడిపల్లి డిటో..డిటో.

అలా అని త్రివిక్రమ్ కథ నచ్చక రాజమౌళి సినిమా ముందుకు తెచ్చినా, లేదా అంత వరకు ఖాళీగా వున్నా మహేష్ కు కనీసం 60 కోట్లు వృధాగా పోతుంది. 60 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అందువల్ల త్రివిక్రమ్ ను నమ్మి సినిమా చేసేయడమే మిగిలిన సరైన ఆప్షన్. 

అందుకే కథ ఏమాత్రం నచ్చినా, మిగతా భారం త్రివిక్రమ్ మీద వేసేసి వెళ్లడం అన్నది సరైన ఆప్షన్ లేదు.