లాక్ డౌన్ లోనూ రెచ్చగొట్టడమే టీడీపీ పని

లాక్ డౌన్ ప్రటించిన తర్వాత చంద్రబాబు సహా మిగతా టీడీపీ నేతల పరిస్థితి విచిత్రంగా తయారైంది. ప్రభుత్వ చర్యల్ని విమర్శించలేక, సమర్థించలేక అవకాశం కోసం గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు. కరోనా ఇంత తీవ్రంగా…

లాక్ డౌన్ ప్రటించిన తర్వాత చంద్రబాబు సహా మిగతా టీడీపీ నేతల పరిస్థితి విచిత్రంగా తయారైంది. ప్రభుత్వ చర్యల్ని విమర్శించలేక, సమర్థించలేక అవకాశం కోసం గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు. కరోనా ఇంత తీవ్రంగా ఉంటే.. స్థానిక ఎన్నికలు ఎలా జరిపేవారంటూ.. కొన్నాళ్లు పాత పాటే పాడారు. ముందు చూపు ఉన్న ఎన్నికల కమిషనర్ పై అనవసరంగా నోరు పారేసుకున్నారని అన్నారు.

ఆ వ్యవహారం పాతపడిపోవడంతో.. స్థానికంగా ప్రజల్ని రెచ్చగొట్టే పనులకు పూనుకున్నారు టీడీపీ నేతలు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డ్ ఎలా పెడతారంటూ ఎంపీ కేశినేని నాని తెగ బాధపడిపోతున్నారు. స్థానిక ప్రజలు ఆగ్రహించక ముందే వేరే చోటికి మార్చాలంటూ ఉచిత సలహా పడేస్తున్నారు.

నాని వ్యాఖ్యలు సలహాలాగా లేవు, స్థానికుల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఒకవేళ ఊరి చివర వైద్య శిబిరం ఏర్పాటు చేసినా, రోగుల్ని బైటపడేశారంటూ అప్పుడు కూడా విమర్శించేవారేమో. ఆరు జిల్లాల వారిని విజయవాడకు ఎందుకు తెస్తున్నారంటూ బాధపడుతున్న నానిది ఎంత సంకుచిత మనస్తత్వమో అర్థమవుతోంది.

ఇక తెలంగాణ నుంచి వస్తున్న వారిని రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆపొద్దంటూ నారా లోకేష్  ఎమోషనల్ డ్రామా మొదలుపెట్టారు. ఏపీ యువత సరిహద్దుల్లో ఇబ్బంది పడుతోందంటూ మొసలి కన్నీరు కార్చారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల చర్చలతో ఆ సమస్య పరిష్కారం కావడంతో లోకేష్ సహా మిగతా టీడీపీ నేతలకు అంతకంటే ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది.

ఇక చంద్రబాబు సైతం ఆర్థిక సాయంపై సెటైర్లు పేల్చారు. వెయ్యి రూపాయల సాయాన్ని 5వేలకు పెంచాలని లేఖాస్త్రాలు సంధించారు. అవసరమైతే తాను హుద్ హుద్ తుఫాను సమయంలో తీసుకున్న జాగ్రత్త చర్యల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఉచిత సలహా పారేశారు. అదే సమయంలో ప్రధాని మోదీని మాత్రం కీర్తించే ఏ అవకాశాన్ని కూడా చంద్రబాబు వదిలిపెట్టడం లేదు. మోదీకి స్తోత్రాలు చెల్లిస్తూ, జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

మొత్తమ్మీద కరోనా నేపథ్యంలో టీడీపీ నేతలు తగ్గుతారనుకుంటే.. అడ్డగోలు విమర్శలతో ప్రజల్లో ఉన్న పరువు కూడా పోగొట్టుకుంటున్నారు.

ఆంధ్రాకి పోవాలా.. ఈ క్యూలైన్ చుడండి

కత్రినా కష్టాలు