ఎన్టీఆర్‌ బయోపిక్‌.. ఇంతేనా? ఇందుకేనా.!

స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌కి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేసింది. రెండోభాగం 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' ఈనెల 22న విడుదల కావాల్సి వుండగా, ఆ సినిమాలో ఏముంటుందోనన్న సస్పెన్స్‌ అయితే ఎవరికీ లేదు. 'ఇదీ ఎన్టీఆర్‌…

స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌కి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేసింది. రెండోభాగం 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' ఈనెల 22న విడుదల కావాల్సి వుండగా, ఆ సినిమాలో ఏముంటుందోనన్న సస్పెన్స్‌ అయితే ఎవరికీ లేదు. 'ఇదీ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర' అంటూ, తన తండ్రికి ఘన నివాళి అన్నట్లుగా నందమూరి బాలకృష్ణ మొదట్లో నానా హంగామా చేశారు. తొలిభాగం 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' రిలీజ్‌ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో బాలయ్య చెప్పిన మాటల్లో 'నిజాయితీ' తెరపై ఏమాత్రం కన్పించలేదు.

ఇక, ఇప్పుడు 'మహానాయకుడు' సినిమా వస్తోంది. ఇందులో అద్భుతాలు వుంటాయని ఎవరూ ఊహించడంలేదుగానీ, 'వెన్నుపోటు' ఎపిసోడ్‌ని ఎలా 'మేనేజ్‌ చేసి వుంటారు.?' అన్న సందేహం అయితే కొందరిలో కలిగింది. కానీ, సందేహాలకే తావులేకుండా పూర్తిగా ఆ ఎపిసోడ్‌ని సైడ్‌లైన్‌ చేసేసినట్టున్నారు. ట్రైలర్‌లో అస్సలేమాత్రం ఆ ఛాయలు కన్పించకపోవడమే ఇందుకు కారణం. ఎందుకిలా.? అంటే, అలా ఆ పార్ట్‌ని టచ్‌ చేసే ధైర్యం బాలకృష్ణకి లేదు కాబట్టి అన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.

సాధారణంగా బయోపిక్‌ అంటే, జీవితంలోని అన్ని విషయాలూ కాకపోయినా ముఖ్యమైన విషయాల్ని తెరకెక్కించాల్సి వుంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌ కేవలం సినీనటుడే అనుకుంటే, అది వేరే వ్యవహారం. కానీ, ఆయన ప్రజా నాయకుడు, మహా నాయకుడు కూడా.! 'అన్న' ఎన్టీఆర్‌ జీవితంలోని 'అతి ముఖ్యమైన ఆ భాగం' చూపించకపోతే, అదసలు అన్నగారి చరిత్రే కాదనే అభిప్రాయం అభిమానులనుంచి వ్యక్తమవుతోంది.

సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. 'బాలయ్య తప్పు చేశాడు.. స్వర్టీయ ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీయకుండా వుండి వుంటే బావుండేదేమో' అని సాక్షాత్తూ బాలయ్య అభిమానులే వాపోతున్నారు. ఏమాత్రం పస లేకపోవడంతో మంచి రివ్యూలు వచ్చినా, 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' బాక్సాఫీస్‌ వద్ద నిలబడలేకపోయింది. అది ఓ రకంగా అన్నగారికి అవమానమే. ఇప్పుడు 'మహానాయకుడు' పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ కన్పించే అవకాశాల్లేవు. అంటే, ఇంకోసారి ఆ మహానుభావుడికి అవమానం తప్పదన్నమాట.

బయోపిక్‌ తీయడం ద్వారా తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ మీద గౌరవం పెంచాల్సింది పోయి, బాలయ్య.. ఇలా ఎందుకు చేశాడబ్బా.? 'కమర్షియల్‌ ఆలోచనలతో కాదు, నాన్న మీద ప్రేమతో..' అని బాలయ్య ప్రమోషన్స్‌లో చెప్పారుగానీ, సినిమాపై క్రేజ్‌ని బాలయ్య ఏ రేంజ్‌లో క్యాష్‌ చేసుకున్నారో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ని చూస్తేనే అర్థమవుతుంది.

దురదృష్టం.. స్వర్గీయ ఎన్టీఆర్‌ అనే పేరు, ఓ 'అమ్మకం' వస్తువులా తయారైంది ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణకి కూడా.! సోషల్‌ మీడియా వేదికగా స్వర్గీయ ఎన్టీఆర్‌ అభిమానుల ఆవేదన ఇది.  

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!