పారితోషకం తగ్గించుకుంటున్న స్టార్ హీరో!

సినిమాలకు కలెక్షన్లు అయితే బాగానే వస్తున్నాయి. అయితే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడంలేదు. ఆ సినిమాలు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. అయితే పెట్టుబడి పెట్టినవారు మాత్రం నష్టపోతూనే ఉన్నారు. వరసగా ఇలాంటి అనుభవాలే ఎదురువుతున్నాయి…

సినిమాలకు కలెక్షన్లు అయితే బాగానే వస్తున్నాయి. అయితే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడంలేదు. ఆ సినిమాలు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. అయితే పెట్టుబడి పెట్టినవారు మాత్రం నష్టపోతూనే ఉన్నారు. వరసగా ఇలాంటి అనుభవాలే ఎదురువుతున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ కు.

కాలా, టూపాయింట్ ఓ సినిమాలు సక్సెస్ ఫుల్ వెంచర్లు కాలేకపోయాయి. పేరుకేమో టూ పాయింట్ ఓ వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే మేకింగ్ బడ్జెట్ భారీగా ఉండటం, వడ్డీలను కలుపుకుంటే.. అది ఫెయిల్యూర్ కిందే లెక్క. ఇక ప్రాంతాల వారీగా కూడా కలెక్షన్లలో తేడాలున్నాయి.

ఇక రజనీకాంత్ ఇటీవలి సినిమా 'పేట' మాత్రం వేగంగా పూర్తిచేశారు. వసూళ్లూ బాగానే వచ్చాయి. దీంతో తమిళ వరకూ అయినా ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఊరటను ఇచ్చింది. ఈ అనుభవాల నేపథ్యంలో తన తదుపరి సినిమాకు పారితోషకాన్ని తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడట రజనీకాంత్.

మురుగదాస్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను రూపొందించనుంది. దీనికి రజనీకాంత్ తన పారితోషకాన్ని తగ్గించుకోనున్నాడనే టాక్ వినిపిస్తోంది. తద్వారా రూపకర్తలపై భారాన్ని తగ్గించి.. ఓ మోస్తరు వసూళ్లు దక్కినా సినిమా హిట్ అనిపించాలని.. డబ్బు కన్నా ఇప్పుడు హిట్ అనిపించుకోవడమే ముఖ్యమని రజనీకాంత్ భావిస్తున్నాడట.

రాజకీయ నేపథ్యంలో మురుగదాస్ సినిమాను రూపొందిస్తున్నాడని దానికి ‘నార్కాలి’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. నార్కాలి అంటే తెలుగులో ‘కుర్చీ’!

వైసీపీ ఆయాకోణాల్లో ఆత్మసమీక్ష చేసుకోవాలి