మహానాయకుడు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ

మొత్తానికి ఓ నిర్ణయం జరిగిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ కు కాంపన్ సేషన్ గా పార్ట్ 2 ఇవ్వాలని నిర్మాత బాలకృష్ణ నిర్ణయించినట్లు బోగట్టా. ఈ రెండోపార్ట్ విడుదల అయిన తరవాత మొత్తం…

మొత్తానికి ఓ నిర్ణయం జరిగిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ కు కాంపన్ సేషన్ గా పార్ట్ 2 ఇవ్వాలని నిర్మాత బాలకృష్ణ నిర్ణయించినట్లు బోగట్టా. ఈ రెండోపార్ట్ విడుదల అయిన తరవాత మొత్తం లెక్కలు చూసుకుందామని ఆయన బయ్యర్లకు ఫోన్ లో అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బాలయ్య నుంచి ఈ అభయం రావడానికి ముందు కాస్త మల్లగుల్లాలు నడచినట్లు తెలుస్తోంది.

సినిమాను పార్ట్ వన్ కొన్న బయ్యర్లకు ఇవ్వకుండా, నేరుగా సురేష్ మూవీస్ ద్వారా పంపిణీ చేయించాలని నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న బాలయ్య బంధువు ప్రసాద్ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి బయ్యర్లు ఆందోళన చెంది. సాయి కొర్రపాటి ద్వారానో, మరో విధంగానో, బాలయ్యకు విషయం చేరవేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో బాలయ్య బంధువు ప్రసాద్ చేసిన ప్రయత్నాలతో కలత చెందిన బయ్యర్లు కొందరు వాళ్లలోవాళ్లు చర్చించుకుని, ఇవన్నీ బాలయ్య దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారట. ఆ మేరకు ఆయనకు ఫోన్ లో విషయం వివరించడంతో మొత్తం సీన్ మళ్లీ మారి, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కు పార్ట్ వన్ బయ్యర్లేకే ఇవ్వాలని నిర్ణయం వెలువడింది. పార్ట్ వన్ చేసిన వారికే రెండోభాగం కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కు ఇవ్వమని బాలయ్య క్లారిటీగా చెప్పేసినట్లు తెలుస్తోంది.

నష్టం సంగతేమిటి?
అయితే తొలిభాగంలో దాదాపు ప్రతి బయ్యరకు 70 నుంచి 80 శాతం నష్టం వచ్చింది. దీనికేం చేస్తారు అన్నది ట్రేడ్ సర్కిళ్లలో వినిపించే ప్రశ్న. రెండోపార్ట్ బాగా ఆడితే టోటల్ గా కలిపి లెక్కలు చూసుకుందామని, ఒకవేళ, మరీ ఎక్కడో అదృష్టం బాగాలేక తేడావస్తే, అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తా అని బాలయ్య చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. రెండోభాగం కూడా జనాదరణకు నోచుకోకపోతే, మొత్తం నష్టాన్ని భరించలేను కానీ, కొంతవరకు అయితే చేస్తా అని బాలయ్య చెప్పినట్లు బోగట్టా.

విడుదల ఎప్పుడు?
సినిమా షూటింగ్ మూడుతో అయిపోయింది అని చెబుతున్నా, వాస్తవానికి మరో నాలుగైదు రోజులు ఇంకా షూటింగ్ వుంది. ముఖ్యంగా పిల్లలతో ఓ పాట ప్లాన్ చేసారు. అది ఇంకా తీయాలి. బాలయ్య వర్క్ కూడా ఒకటి రెండు రోజులువుంది. ఆయన మంగళవారం సాయంత్రం వస్తున్నారు. బుధ, గురువారాల్లో ఆయన వర్క్ పూర్తి చేసే అవకాశం వుంది.

అన్ని పనులు పూర్తిచేసి, 15 నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేయాలని, ఈ పిల్లల పాట వగైరాలు చివరలో జోడించుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే కీరవాణి ఆర్ ఆర్ మీద ఇవన్నీ ఆధారపడి వున్నాయి. అందువల్ల 22కు సినిమా రావడం అన్నది ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ అని తెలుస్తోంది.

బాలయ్య ఆరా?
అసలు కథనాయకుడు వైఫల్యం ఎక్కడ? ఎందుకు జనాదరణ పొందలేదు అని తనతో మాట్లాడిన బయ్యర్లను బాలయ్య ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రెండోభాగం మీద చాలా ధీమా వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. రెండోభాగంలో సినిమాటిక్ సీన్లు, హీరోయిజం, ఇంకా చాలా చాలా వుంటాయి కనుక, కచ్చితంగా ఈ భాగం విజయం సాధిస్తుందని బాలయ్య ధీమాగా వున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ఆయాకోణాల్లో ఆత్మసమీక్ష చేసుకోవాలి