ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యింద‌ని, ఈ హీరోయిన్ల‌పై ట్రోల్!

బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ త‌ల్లి కాబోతున్న విష‌యంపై వార్త‌లు వ‌చ్చాకా… నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు! ఎవ‌రి టేస్టుకు త‌గ్గ‌ట్టుగా వారి స్పంద‌న‌లున్నాయి. వారి పెళ్లై రెండు నెల‌లే అయిన‌ట్టున్నాయ‌ని.. అప్పుడే మూడో…

బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ త‌ల్లి కాబోతున్న విష‌యంపై వార్త‌లు వ‌చ్చాకా… నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు! ఎవ‌రి టేస్టుకు త‌గ్గ‌ట్టుగా వారి స్పంద‌న‌లున్నాయి. వారి పెళ్లై రెండు నెల‌లే అయిన‌ట్టున్నాయ‌ని.. అప్పుడే మూడో నెలనా! అనే వారితో మొద‌లుపెడితే ఎవ‌రి లెవ‌ల్లో వారు స్పందిస్తున్నారు.

ఆ సంగ‌త‌లా ఉంటే… అలియా భ‌ట్ త‌ల్లి కావ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఇత‌ర బాలీవుడ్ హీరోయిన్లను ట్రోల్ చేస్తున్నారు మ‌రి కొంద‌రు మేథావులు. పెళ్లైన వెంట‌నే త‌ల్లి అవుతున్న అలియాను చూసి వారు బుద్ధి తెచ్చుకోవాల‌న్న‌ట్టుగా ఉంది వీరి వ్య‌థ‌! అంటే ఇప్ప‌టికిప్పుడు ఆ హీరోయిన్లు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే వారు మంచి వాళ్ల‌న‌మాట‌! 

ఇలా నెటిజ‌న్ల ట్రోల్ బారిన ప‌డిన వారిలో క‌త్రినాకైఫ్, దీపికా ప‌దుకోన్ ఉన్నారు. దీపిక పెళ్లై ఇప్ప‌టికే కొన్నేళ్లు అయ్యాయి. క‌త్రినా కూడా కొన్నాళ్ల కింద‌ట వివాహిత అయ్యింది. అలియా లాగ‌నే వీళ్లు కూడా బాలీవుడ్ హీరోల‌నే పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి జ‌రిగిన కొంత కాలానికే ర‌ణ్ భీర్, అలియాలు త‌ల్లి దండ్రులు కాబోతున్నారు. అయితే ఈ విష‌యంలో రీజ‌న్లు ఏవైనా.. క‌త్రినా, దీపిక లు ప్రెగ్నెన్సీ ముచ్చ‌ట్లేవీ చెప్ప‌డం లేదు. అది పూర్తిగా వారి వ్య‌క్తిగ‌తం. 

అయితే సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల్లోకి చొచ్చుకుపోయి.. వారిని ట్రోల్ చేస్తూ ట్రెండింగ్ లో నిల‌వ‌డం ఇప్ప‌ట్లో ఒక ఫ్యాష‌న్! దీంతో.. అలియా ప్రెగ్నెన్సీ వార్త‌ల నేప‌థ్యంలో.. దీపికా, క‌త్రినాలు ఇలా అనూహ్యంగా టార్గెట్ అవుతున్నారు.