నిజంగా కరోనాకు అసలు హృదయం లేదు. కరోనా చాలా అమానవీయంగా ప్రవర్తిస్తోంది. తాజాగా ఓ ప్రేమ జంట విడిపోవడానికి కరోనా కారణమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా సోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా , దాని పని అది చేసుకుపోతోంది. సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు తమను తాము స్వీయ నిర్బంధంలో ఉంచుకుంటున్నారు.
కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా లోకానికి చెప్పింది. తనకు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత కేవలం పారాసిటమాల్ మాత్ర ఇచ్చారని, ఇంతకు మించి వైద్యులు ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని ఆమె వివరించింది.
కరోనా సోకిన ఓల్గా స్వయంగా తన అనుభవాన్ని చెప్తూ ప్రజలతో పాటు అభిమానులకు అవగాహన కల్పిస్తోంది. తాను ఇంట్లో అందరికి దూరంగా ఉంటున్నానని.. కానీ కరోనా వైరస్ని ఎదుర్కొనడానికి మనవంతు ప్రయత్నం చేయాలని ఓల్గా తనకు తాను ధైర్యం చెప్పుకోవడంతో పాటు ప్రపంచానికి స్థైర్యాన్ని నూరిపోస్తోంది. నిజంగా ఈ విషయంలో ఓల్గాను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనాకు సంబంధించి ఆమె ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చింది. విటమిన్ బీ5, విటమిన్-ఈ, విటమిన్-సీ, జింక్ కరోనా నియంత్రణకు ఎంతగానో సహకరిస్తాయని తెలిపింది. ఇవి వాడిన తర్వాతే తనకు జ్వరం కూడా తగ్గిందని ఓల్గా చెప్పింది.
ఇవన్నీ ఆమెను ఒకవైపు బాధపెడుతుంటే, మరోవైపు ఇంకో చేదు అనుభవం ఎదురైందనే ప్రచారం సాగుతోంది. ఓల్గాకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక, ఆమె బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా ఆమెకు బ్రేకప్ చెప్పాడనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అయితే దీనిపై ఆమె ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ కరోనా మహమ్మారీ మనుషులనే అంతమొందిస్తున్నప్పుడు….ఇక వాళ్ల మధ్య ప్రేమ ఓ లెక్కా?