కలవరపెడుతున్న కరోనా అంకెలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ 24 గంటల కర్ఫ్యూ  ప్రకటించారు. ప్రధాని మోడీ ప్రకటించిన డే లాంగ్ కర్ఫ్యూను ఆయన 24 గంటల కర్ప్యూగా మార్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ 24 గంటల కర్ఫ్యూ  ప్రకటించారు. ప్రధాని మోడీ ప్రకటించిన డే లాంగ్ కర్ఫ్యూను ఆయన 24 గంటల కర్ప్యూగా మార్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో వుంటుంది. అయితే ఈ సందర్భంగా కేసిఆర్ వెల్లడించిన అంకెలు కాస్త కలవరం కలిగించేవిలాగే వున్నాయి.

తెలంగాణకు మార్చి 1 నుంచి ఇప్పటికి అంటే 20 రోజుల్లో 20 వేల మంది విదేశాల నుంచి వచ్చారట. శుక్రవారం నాడే 1500 మంది వచ్చారట. వీరిలో నేరుగా విదేశాల నుంచి వచ్చిన వారు, అలాగే విదేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వచ్చి అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన వారు వున్నారట. 

అయితే వీరిలో 11 వేల మందని మాత్రమే అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, పరీక్షలు నిర్వహించారు. అంటే ఇంకా తొమ్మిదివేల మందికి పరిక్షలు నిర్వహించాల్సి వుంది. ఇలా గుర్తించడం కోసం అయిదువేలకు పైగా బృందాలు పనిచేస్తున్నాయి. అది నిజంగా అభినందించదగ్గ విషయం. 

ఇప్పటికి 21 మందికి పాజిటివ్ రిజల్ట్ రాగా, 700 మంది వరకు కరోనా అనుమానితులు వున్నారట. వీరిలో ఎవరికి, ఎంత మందికి పాజిటివ్ వస్తుందో, ఎంత మందికి నెగిటివ్ వస్తుందో తెలియదు. నెగిటివ్ వస్తే సమస్యే లేదు., పాజిటివ్ వస్తే, మళ్లీ ప్రోటోకాల్ ఫాలో అప్ కార్యక్రమాలు చేపట్టి, మరింత మందిని పరిక్షించాల్సి వుంటుంది. 

మొత్తం మీద సిఎమ్ కేసిఆర్ చెప్పిన అంకెలు వింటే ఆలోచించాల్సిందే. ప్రతి ఒక్కరు కరోనా మరింత వ్యాప్తి కాకుండా, ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాల్సిందే.

దేవుడికి కోపం వచ్చింది