ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడించిన బాబు అనే కరోనా వైరస్‌ను ప్రజలు ఎలాగోలా తరిమికొట్టారని అంతా అనుకున్నారు. కానీ బాబు కరోనా అనే వైరస్ అంతా సులభంగా అంతమయ్యేది కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. బాబు కరోనాను తరిమి కొట్టాలంటే ఒక్క సార్వత్రిక ఎన్నికల్లో ఓడిస్తేనే సరిపోదని, దాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలని ఏపీకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతోంది.
కరోనాను కూడా రాజకీయానికి వాడుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. కరోనానే కాదు, దేన్నైనా తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని వదిలేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అన్ని జిల్లాల పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ అన్న మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది.
‘ఒక వ్యవస్థ విఫలమైతే మరో వ్యవస్థ కాపాడటమే భారత ప్రజాస్వామ్యం గొప్పదనం. జగన్ వంటి ఫ్యూడల్ పాలకులు వస్తారన్న ముందు జాగ్రత్తతోనే రాజ్యాంగ నిర్మాతలు ఈ వ్యవస్థల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కట్టుదిట్టం చేశారు’…. ఇవి చంద్రబాబు మాట్లాడిన మాటలు.
తన ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నిటిని భ్రష్టు పట్టించిన ఘన చరిత్ర చంద్రబాబుది. ప్రతిపక్ష వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా కొందరికి మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యానికే కళంకం తీసుకొచ్చాడు. ఇప్పుడాయన ప్రజాస్వామ్యం, వ్యవస్థ, రాజ్యాంగం అంటూ సమాజానికి నీతులు చెబుతున్నాడు. చేసేదన్నీ తప్పుడు పనులు…మాటల్లో మాత్రం గౌతమ బుద్ధుడి వారసుడినన్నంత ఫోజులు. కరోనా కంటే బాబు వైరస్ ఈ రాష్ట్రానికి ఎక్కువ ప్రమాదకరం. కరోనాపై ఎలాగైతే ప్రజలంతా అప్రమత్తంగా ఉన్నారో….ఈ రాజకీయ వైరస్ బాబు విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.